డీఎస్సీపై బురద చల్లొద్దు.. ఆధారాలుంటే చూపండి: పల్లా సవాల్
- డీఎస్సీపై గొడ్డలి పార్టీది దుష్ప్రచారం అన్న పల్లా
- ఆధారాలుంటే ఆరోపణలు నిరూపించాలని సవాల్
- ప్రజల దృష్టి మళ్లించడానికే జగన్ ఆరోపణలని విమర్శ
- చంద్రబాబు, లోకేశ్ చొరవతో యువతకు ఉద్యోగ భరోసా అని స్పష్టీకరణ
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోదంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని, ఎంపికైన అభ్యర్థులే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన అన్నారు. డీఎస్సీ నియామకాలపై బురదజల్లడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్ తన దిగజారుడు రాజకీయాలను బయటపెట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన ఒక అభ్యర్థిని స్వయంగా కలిసి, ఎంపిక ప్రక్రియ ఎలా జరిగిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాతపరీక్ష నుంచి కౌన్సెలింగ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం పారదర్శకత పాటించిందని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదని ఆ అభ్యర్థి తనకు వివరించినట్లు పల్లా తెలిపారు. అభ్యర్థులే వాస్తవాలు చెబుతున్నా, గొడ్డలి పార్టీ నేతలు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
వంద శాతం పారదర్శకంగా నియామకాలు
కూటమి ప్రభుత్వం 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను వంద శాతం పారదర్శకంగా, కేవలం మెరిట్ ప్రాతిపదికనే చేపట్టిందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. క్రీడా కోటాలో సైతం అభ్యర్థుల అర్హతలను, వారు సమర్పించిన ధ్రువపత్రాలను నిపుణులతో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఈ ప్రక్రియలో ఎక్కడైనా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వారు, అందుకు సంబంధించిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని ఆయన సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
దొంగే దొంగ అన్నట్లు వైసీపీ తీరు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసి, ఏపీపీఎస్సీలో అక్రమాలకు పాల్పడిన వారు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని పల్లా ఎద్దేవా చేశారు. "వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయనే భయంతోనే జగన్ రెడ్డి, ప్రజల దృష్టిని మళ్లించడానికి డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వారి తీరు దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉంది" అని పల్లా విమర్శించారు. అభ్యర్థులు ఏళ్ల తరబడి కష్టపడి చదివి సాధించుకున్న ఉద్యోగాలను రాజకీయ వివాదాల్లోకి లాగడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పల్లా తెలిపారు. మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో నియామక ప్రక్రియలు వేగవంతమయ్యాయని, అర్హులైన యువతకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే రాజకీయాలు మానుకోవాలని జగన్ రెడ్డికి హితవు పలికారు. గొడ్డలి పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా, వాస్తవాలను దాచలేరని, వారి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.