జైలులో ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో 173 పోర్న్ వీడియోలు.. నిర్ధారించిన ఫోరెన్సిక్ ల్యాబ్
- మూడు వీడియోలు ప్రజ్వల్‌కు సంబంధించినవిగా అనుమానం
- పెన్‌డ్రైవ్‌లో 150కి పైగా వీడియోలు ఉన్నట్లు వెల్లడి
- పలువురు మహిళలకు వాట్సాప్, వీడియో కాల్స్ చేసినట్లు గుర్తింపు
- కొందరు మహిళలకు నోటీసులు ఇచ్చే యోచనలో పోలీసులు
- జైలు వార్డర్ ఫోన్ అందించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జైలు గదిలో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌లో వందలాది పోర్న్ వీడియోలు ఉన్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నిర్ధారించింది. మొత్తం 173 వీడియో ఫైళ్లు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వాటిలో ప్రజ్వల్‌కు సంబంధించినవిగా భావిస్తున్న మూడు అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం.
బెంగళూరు కేంద్ర కారాగారంలో ఆగస్టు 11న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రజ్వల్ రేవణ్ణ, మరో ఖైదీ ప్రతాప్ రాయ్ ఉంటున్న గదిలో మొబైల్ ఫోన్ దొరికింది. పాస్‌వర్డ్ చెప్పేందుకు ఇద్దరూ నిరాకరించడంతో ఫోన్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. తాజాగా వచ్చిన నివేదికలో వీడియో ఫైళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
మొబైల్‌లో కన్నడ, హిందీ, ఇంగ్లిష్ సినిమాల క్లిప్పులు, వెబ్‌సిరీస్ వీడియోలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెన్‌డ్రైవ్‌లోనూ 150కి పైగా వీడియోలు ఉన్నట్లు వెల్లడైంది. వాటినీ అధికారులు పరిశీలిస్తున్నారు.
ఫోన్‌లో వాట్సాప్, వీడియో కాల్స్ జరిగినట్లు కాల్ రికార్డుల పరిశీలనలో తేలింది. పలువురు మహిళలతో సంప్రదింపులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రజ్వల్‌తో గతంలో కొన్ని వీడియోల్లో కనిపించిన కొందరు మహిళలతో జరిగిన కాల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అవసరమైతే వారికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది.
జైలులో ఉన్న సమయంలో ప్రజ్వల్ కుటుంబ సభ్యులతో తరచూ మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. తన న్యాయవాదితోనూ ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
ఇక హైసెక్యూరిటీ జైలులోకి ఫోన్ ఎలా చేరిందన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఓ జైలు వార్డర్ ప్రజ్వల్‌కు ఫోన్ అందించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తౌసీఫ్ అనే రౌడీషీటర్ పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. డిజిటల్ ఆధారాలు, కాల్ రికార్డులు, జైలు సిబ్బంది వాంగ్మూలాలతో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.