వెంకీ-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌కు టైమ్ ఫిక్స్!
- రేపు మధ్యాహ్నం 12 గంటలకు టీజర్ విడుదల
- హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి.. కీలక పాత్రలో నారా రోహిత్
- గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న సినిమా రిలీజ్
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నంబర్: 47) సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారికి చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ మూవీ అధికారిక టీజర్‌ను రేపు (శనివారం) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేశ్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
గతంలో వెంకటేష్ హీరోగా నటించిన క్లాసిక్ హిట్స్ ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాల్లోని సంభాషణలు, వెంకటేష్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్‌లో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వస్తుండటంతో సినిమాపై విపరీతమైన క్రేజ్ నెలకొంది.
ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజా అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.