సుజుకీ జిక్సర్‌ లుక్‌ మారింది.. ధర రూ.1.37 లక్షల నుంచే

సుజుకీ జిక్సర్‌ లుక్‌ మారింది.. ధర రూ.1.37 లక్షల నుంచే

Suzuki Gixxer look changes price starts from 137 lakh
  • 155సీసీ మోడళ్లకు గ్రే-ఆరెంజ్‌ కలర్‌
  • 250సీసీ బైక్‌లకు బ్లాక్‌-గ్రే కొత్త షేడ్‌
  • ఎస్‌ఎఫ్‌ 250 ఎఫ్‌ఎఫ్‌వీకి రెండు కొత్త రంగులు
  • ఇంజిన్‌, ఫీచర్లలో లేని మార్పులు
  • దేశవ్యాప్తంగా సుజుకీ డీలర్‌షిప్‌లలో లభ్యం
బైక్‌ ప్రియులకు సుజుకీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. తన ప్రముఖ జిక్సర్‌ బైక్‌ రేంజ్‌ను కొత్త రంగులతో రిఫ్రెష్‌ చేసింది. జిక్సర్‌, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌, జిక్సర్‌ 250, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 ఎఫ్‌ఎఫ్‌వీ మోడళ్లకు కొత్త కలర్‌ ఆప్షన్లను తీసుకొచ్చింది. అయితే బైక్‌ల ఇంజిన్‌, చాసిస్‌, ఫీచర్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ అప్‌డేట్‌ పూర్తిగా లుక్‌ కోసమే. 

155cc జిక్సర్‌, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ మోడళ్లకు మెటాలిక్‌ ఓర్ట్‌ గ్రే - పెర్ల్‌ బ్లేజ్‌ ఆరెంజ్‌ డ్యూయల్‌ టోన్‌ కలర్‌ను కొత్తగా జోడించారు. జిక్సర్‌ ధర రూ.1,37,221 నుంచి మొదలవుతుంది. జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ ధర రూ.1,40,729 నుంచి ఉంటుంది. ఈ రెండు బైక్‌లలో 155cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ కొనసాగుతుంది. 

250cc మోడళ్ల విషయానికి వస్తే.. జిక్సర్‌ 250, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250కు గ్లాస్‌ స్పార్కిల్‌ బ్లాక్‌ - మెటాలిక్‌ ఓర్ట్‌ గ్రే కలర్‌ను కొత్తగా అందించారు. జిక్సర్‌ 250 ధర రూ.1,84,517 నుంచి మొదలవుతుండగా.. జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 ధర రూ.1,92,768 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు బైక్‌లలో 249cc ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 26.5పీఎస్‌ పవర్‌, 22.2ఎన్‌ఎం టార్క్‌ ఇస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌, డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌‌ వంటి ఫీచర్లు కొనసాగుతాయి. 

ఇక జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 ఎఫ్‌ఎఫ్‌వీ రెండు కొత్త కలర్‌ ఆప్షన్లతో వచ్చింది. గ్లాస్‌ స్పార్కిల్‌ బ్లాక్‌ - మెటాలిక్‌ ఓర్ట్‌ గ్రేతో పాటు పూర్తిగా గ్లాస్‌ స్పార్కిల్‌ బ్లాక్‌ కలర్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.1,98,476గా ఉంది. ఇది ఈ85 వరకు ఇథనాల్‌ కలిసిన ఇంధనంతో పనిచేసే ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ బైక్‌. దీని ఇంజిన్‌ 27.9పీఎస్‌ పవర్‌, 22.5ఎన్‌ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 

కొత్త రంగులతో జిక్సర్‌ రేంజ్‌ లుక్‌లో మార్పు వచ్చినా.. పనితీరు, మెకానికల్‌ సెటప్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ బైక్‌లు దేశవ్యాప్తంగా సుజుకీ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయి.
Advertisement
Suzuki Gixxer
Suzuki Motorcycles India
Suzuki Gixxer SF 250
New Suzuki Gixxer colors
Suzuki Gixxer price in India
Flex fuel bike India

More Telugu News