రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ.. నేటి నుంచి రెండు రోజుల పర్యటన

రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ.. నేటి నుంచి రెండు రోజుల పర్యటన

Rahul Gandhi starts two day visit to Rae Bareli today
  • జిల్లా అభివృద్ధి కమిటీ (దిశ) సమావేశానికి అధ్యక్షత వహించనున్న రాహుల్ గాంధీ
  • శివ్‌గఢ్, మహారాజ్‌గంజ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన
  • యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న పర్యటన
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నేడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు.

ఈ సమావేశంలో నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తీరును రాహుల్ సమీక్షించనున్నారు. ముఖ్యంగా ఇటీవల సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులను ఆరా తీయనున్నారు. అమేథీ ఎంపీ కిశోరీ లాల్ శర్మ అధ్యక్షతన గతంలో జరిగిన ‘దిశ’ సమావేశం అనంతరం చేపట్టిన చర్యలపై అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు.

అనంతరం రాహుల్ గాంధీ శివ్‌గఢ్, మహారాజ్‌గంజ్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, వరద నష్టాన్ని స్వయంగా అంచనా వేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించేందుకు ఈ పర్యటన దోహదపడనుంది.

కాగా, రాహుల్ గాంధీ చివరిసారిగా ఈ ఏడాది మే 19, 20 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. ఆ సమయంలో రాయ్‌బరేలీలోని బచ్‌రావాన్‌లో తన ఎంపీ నిధులతో నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు.
Advertisement
Rahul Gandhi
Rae Bareli
DISHA Meeting
Uttar Pradesh Politics
Congress Party
Flood affected areas

More Telugu News