కోచ్ పదవికి ముందు భార్య పర్మిషన్ కావాలి.. టీమిండియా కోచింగ్‌పై ఆశిష్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు
- టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలపై స్పందించిన ఆశిష్ నెహ్రా
- ప్రస్తుతానికి ఆ పదవిపై ఎలాంటి ఆశలు లేవని స్పష్టం
- కోచింగ్ అంటే ఏడాదికి 8-9 నెలల ప్రయాణం, అంత సులభం కాదని వ్యాఖ్య
- గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా ఎంతో సంతోషంగా ఉన్నానని వెల్లడి
- భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామన్న మాజీ పేసర్
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవిపై జరుగుతున్న చర్చపై మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ (జీటీ) కోచ్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. ప్రస్తుతానికి తనకు టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించే ఆశ లేదని, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతాలో జరిగిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) వార్షిక అవార్డుల కార్యక్రమంలో నెహ్రా ఈ విషయాలను వెల్లడించాడు.
"ముందుగా చెప్పాలంటే, నేను 'ఆశ' అనే పదాన్ని వాడను. భవిష్యత్తు గురించి నేనెప్పుడూ ప్లాన్ చేసుకోను. ఆ పదవి దక్కడం కచ్చితంగా గొప్ప గౌరవమే. కానీ, ప్రస్తుతానికి గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని నెహ్రా తెలిపాడు. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తదుపరి కోచ్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు నెహ్రా పేరు కూడా బలంగా వినిపిస్తోంది.
అంతర్జాతీయ కోచింగ్ బాధ్యతల సవాళ్ల గురించి మాట్లాడుతూ.. "అది అంత సులభం కాదు. ఏడాదికి 8-9 నెలలు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో చాలా మంది కోచ్‌లు 3-4 ఏళ్లకు మించి కొనసాగలేరు. ఒకవేళ ఆ అవకాశం వస్తే, ముందుగా మా హైకమిషన్ అయిన నా భార్యను అడగాలి. లేదంటే విడాకులు ఇస్తుంది" అని నెహ్రా సరదాగా వ్యాఖ్యానించారు.
ఆశిష్ నెహ్రా కోచింగ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 2022లో అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2023, 2026 సీజన్లలో కూడా ఫైనల్స్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది.