యెమెన్‌లో మళ్లీ భగ్గుమన్న హింస.. నాలుగు రోజుల్లో 117 మంది బలి
- యెమెన్‌లో ప్రభుత్వ దళాలు, హౌతీల మధ్య మళ్లీ భీకర పోరు
- మృతుల్లో 54 మంది సైనికులు, 63 మంది హౌతీ తిరుగుబాటుదారులు
- తాయిజ్, హోదైదా ప్రావిన్సుల్లో ఇరు వర్గాల దాడులు, ప్రతిదాడులు
- ఇటీవలి కాలంలో ఇదే అత్యంత తీవ్రమైన ఘర్షణ
యెమెన్‌లో మళ్లీ హింస ప్రజ్వరిల్లింది. ప్రభుత్వ బలగాలకు, హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య పశ్చిమ ప్రావిన్సులైన తాయిజ్, హోదైదాలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న భీకర ఘర్షణల్లో కనీసం 117 మంది మరణించారు. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న యుద్ధ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో దేశంలో మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వైద్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం నుంచి మొదలైన ఈ పోరులో 54 మంది ప్రభుత్వ సైనికులు ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. అదే సమయంలో, హోదైదా ప్రావిన్సులోని హౌతీ అధీనంలో ఉన్న ఆసుపత్రుల సమాచారం ప్రకారం, 63 మంది హౌతీ సభ్యులు మరణించారు. దీంతో ఇరుపక్షాల మృతుల సంఖ్య 117కు చేరినట్లు వైద్య వర్గాలు ధ్రువీకరించాయి.
వ్యూహాత్మకమైన బాబ్ అల్-మందబ్ జలసంధి సమీపంలో హౌతీలు పెద్ద ఎత్తున దాడులకు దిగడంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయి. గత 24 గంటల్లో హౌతీలు కొన్ని ప్రాంతాల్లో వేగంగా ముందుకు చొచ్చుకురావడంతో, ప్రభుత్వ దళాలు వారిపై ఎదురుదాడికి దిగాయి. శుక్రవారం యెమెన్ ప్రభుత్వ యుద్ధ విమానాలు హోదైదా, తాయిజ్ ప్రావిన్సుల్లోని హూతీల స్థావరాలపై వైమానిక దాడులు జరిపి భూతల దళాలకు మద్దతుగా నిలిచాయి. ప్రభుత్వ సైనిక అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, హౌతీలు స్వాధీనం చేసుకున్న కొన్ని కీలక స్థానాలను ప్రభుత్వ దళాలు మెరుపు వేగంతో జరిపిన ప్రతిదాడిలో తిరిగి చేజిక్కించుకున్నాయి.
ఇటీవలి సంవత్సరాలలో పశ్చిమ యెమెన్‌లో ఇంతటి తీవ్రస్థాయిలో భూతల పోరాటం జరగడం ఇదే మొదటిసారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2014 చివర్లో హౌతీలు రాజధాని సనాతో పాటు ఉత్తర యెమెన్‌లోని చాలా ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో యెమెన్‌లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత 2015లో, అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.