అమెజాన్‌ కార్గో విమానం బీభత్సం.. ఐదుగురి మృతి: వీడియో ఇదిగో

అమెజాన్‌ కార్గో విమానం బీభత్సం.. ఐదుగురి మృతి: వీడియో ఇదిగో

Amazon cargo plane disaster five dead video goes viral
  • మియామిలో ప్రమాదానికి గురైన అమెజాన్‌ కార్గో విమానం
  • మరో ఐదుగురికి గాయాలు
  • మరో ముగ్గురి పరిస్థితి విషమం
  • వాహనాలను ఢీకొట్టి మంటల్లో చిక్కుకున్న విమానం
  • కాక్‌పిట్‌లో చిక్కుకున్న పైలట్‌, కోపైలట్‌
అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెజాన్‌ కార్గో విమానం ల్యాండింగ్‌ సమయంలో రన్‌వే దాటి పక్కకు దూసుకెళ్లింది. అక్కడ ఉన్న పలు వాహనాలను ఢీకొట్టింది. ఆ వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బోయింగ్‌ 767 విమానం రన్‌వేపై అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లడం అందులో కనిపించింది. అనంతరం పక్కనే ఉన్న వాహనాలను ఢీకొట్టిన విమానం మంటల్లో చిక్కుకుంది. దట్టమైన పొగ అలముకుంది. 

ప్రైమ్‌ ఎయిర్‌ ఫ్లైట్‌ 7598 పేరిట ఉన్న ఈ విమానం ప్యూర్టో రికోలోని శాన్‌ జువాన్‌ నుంచి మియామికి వచ్చింది. స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన వాహనాల్లో కొందరు చిక్కుకుపోయారు. విమానం కాక్‌పిట్‌లో పైలట్‌, కోపైలట్‌ కూడా చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఓ వ్యక్తి వాహనం కింద ఇరుక్కోవడంతో సహాయక సిబ్బంది బయటకు తీశారు. 

ప్రమాదం తర్వాత విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోయాయి. రన్‌వేలు, ట్యాక్సీవేలను కొంతసేపు మూసివేశారు. సహాయక చర్యల్లో 60కి పైగా ఫైర్‌ వాహనాలు పాల్గొన్నాయి. దాదాపు 200 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. 

ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తేలలేదు. ఎఫ్‌ఏఏ, ఎన్‌టీఎస్‌బీ దర్యాప్తు ప్రారంభించాయి. ఘటనపై అమెజాన్‌ కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపింది.
Advertisement
Amazon Cargo Plane
Miami International Airport
Prime Air Flight 7598
Boeing 767 crash
Miami plane crash video
FAA NTSB investigation

More Telugu News