హెచ్-1బీ వీసాలపై ఉక్కుపాదం.. వేతనాల మాయాజాలంపై అమెరికా సీరియస్
- హెచ్-1బీ వీసాలపై అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం కఠిన చర్యలు
- తక్కువ జీతాలు చూపిందంటూ ఓ ఐటీ కంపెనీ పిటిషన్లు రద్దు
- ఇది అమెరికన్ ఉద్యోగులకు నష్టం కలిగిస్తుందని యూఎస్‌సీఐఎస్ వెల్లడి
- ఉపాధి ఆధారిత ఇమ్మిగ్రేషన్ సమగ్రతను కాపాడటానికే ఈ చర్యలని స్పష్టీకరణ
అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఆధారపడిన ఐటీ కంపెనీలకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) గట్టి హెచ్చరిక జారీ చేసింది. అధిక నైపుణ్యాలు అవసరమైన టెక్నాలజీ ఉద్యోగాలకు కావాలనే తక్కువ వేతన స్థాయిలను (వేజ్ లెవెల్స్) చూపించిందన్న కారణంతో ఓ ప్రముఖ ఐటీ కన్సల్టింగ్ సంస్థకు చెందిన పలు హెచ్-1బీ పిటిషన్లను తిరస్కరించడమే కాకుండా, గతంలో జారీ చేసిన వాటిని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కఠిన చర్య ద్వారా హెచ్-1బీ నిబంధనల అమలులో తమ నిబద్ధతను చాటుకుంది.
ఈ మేరకు యూఎస్‌సీఐఎస్ తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది. తమ వెర్మాంట్ కార్యాలయం ఈ ఉల్లంఘనలను గుర్తించిందని తెలిపింది. "అధిక నైపుణ్యాలు, అనుభవం అవసరమైన ఉద్యోగాలకు, వాటి స్థాయికి తగిన వేతనాలు కాకుండా తక్కువ వేతనాలను వర్గీకరించి ఓ ప్రముఖ ఐటీ కన్సల్టింగ్ సంస్థ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ విధానం చట్ట ప్రకారం చెల్లించాల్సిన వేతనాలను దెబ్బతీయడమే కాకుండా, అమెరికన్ ఉద్యోగులకు అన్యాయమైన పోటీని సృష్టిస్తుంది. అందుకే మేము పలు పిటిషన్లను తిరస్కరించడంతో పాటు, కొన్నింటిని రద్దు చేశాం. తద్వారా అమెరికన్ కార్మికులను రక్షించడంతో పాటు ఉపాధి ఆధారిత ఇమ్మిగ్రేషన్ కార్యక్రమాల సమగ్రతను కాపాడుతున్నాం" అని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.
సాధారణంగా హెచ్-1బీ వీసా కింద ఉద్యోగులను నియమించుకునే సంస్థలు, ఆయా ఉద్యోగాల బాధ్యతలు, అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలి. అయితే, ఈ సంస్థ నిబంధనలను ఉల్లంఘించిందని యూఎస్‌సీఐఎస్ ఆరోపించింది. ఇది అమెరికన్ మార్కెట్‌లో వేతన ప్రమాణాలను దెబ్బతీస్తుందని, స్థానిక ఉద్యోగులకు అవకాశాలు తగ్గడానికి కారణమవుతుందని ఏజెన్సీ అభిప్రాయపడింది.
అయితే యూఎస్‌సీఐఎస్ తన ప్రకటనలో ఆ ఐటీ కంపెనీ పేరును గానీ, ఎన్ని పిటిషన్లు ప్రభావితమయ్యాయన్న విషయాన్ని గానీ, ఏయే టెక్నాలజీ ఉద్యోగాలకు సంబంధించిన పిటిషన్లు రద్దయ్యాయన్న వివరాలను గానీ వెల్లడించలేదు. ఈ చర్య హెచ్-1బీ వీసాలను వినియోగించుకుంటున్న ఇతర కంపెనీలకు, ముఖ్యంగా భారతీయ ఐటీ సంస్థలకు ఒక బలమైన సంకేతాన్ని పంపింది. పిటిషన్ల దాఖలులో పూర్తి పారదర్శకత, కచ్చితత్వం పాటించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. వేతన నిబంధనలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించేది లేదని ఈ చర్య ద్వారా యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.