హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం
- హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచస్థాయి క్రికెట్ స్టేడియం
- గుజరాత్‌లోని మోదీ స్టేడియంను మించిన సామర్థ్యంతో నిర్మాణం
- 100 ఎకరాల భూమిని ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం
- నిర్మాణ, నిర్వహణ ఖర్చులను భరించనున్న బీసీసీఐ
- డిసెంబర్‌లో శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచస్థాయి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఆయన ఆదేశాలతో అధికారులు ఇప్పటికే అనువైన స్థలం కోసం అన్వేషణ ప్రారంభించారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ భారీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (1,32,000 సీటింగ్ సామర్థ్యం) ఉంది. దీనిని మించిపోయేలా ఫ్యూచర్ సిటీలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో కొత్త స్టేడియం నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించనుండగా, నిర్మాణ, నిర్వహణ వ్యయాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భరించనుంది.
ఈ స్టేడియం నిర్మాణం కోసం ఎంపిక చేయబోయే ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు మార్గం, శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉండేలా చూస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకులు సులభంగా రాకపోకలు సాగించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో రానున్న స్పోర్ట్స్ సిటీ, టూరిజం, నెట్ జీరో సిటీ కాన్సెప్ట్‌లో ఈ క్రీడా ప్రాంగణం ఒక కీలక ఆకర్షణగా నిలవనుంది. కేవలం క్రికెట్‌కే కాకుండా, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, భారీ సంగీత కచేరీలు (కాన్సర్ట్‌లు) నిర్వహించేందుకు వీలుగా దీనిని మల్టీపర్పస్ వేదికగా తీర్చిదిద్దనున్నారు.