సందీప్ రెడ్డి పిలిస్తే రాకపోతే నా బతుకు వేస్ట్: విజయ్ దేవరకొండ
- 'రోమాంచకం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ భావోద్వేగ ప్రసంగం
- సందీప్ రెడ్డి వంగాతో తన బంధం మాటల్లో చెప్పలేనిదన్న విజయ్
- ‘అర్జున్ రెడ్డి’ కోసం సందీప్ కుటుంబం ఆస్తులు అమ్మిందని వెల్లడి
- హీరో సుమంత్ ప్రభాస్‌కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన స్టార్ హీరో విజయ్ దేవరకొండ భావోద్వేగంగా ప్రసంగించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన కుటుంబంపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. సందీప్ రెడ్డి పిలిస్తే ఈ వేడుకకు రాకపోతే తన జీవితమే వృథా అని విజయ్ వ్యాఖ్యానించారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “నాకు, సందీప్‌కు మధ్య ఉన్నది కేవలం హీరో-డైరెక్టర్ బంధం మాత్రమే కాదు. మేం అన్నదమ్ములం, స్నేహితులం అనడం కంటే మా మధ్య అనుబంధం చాలా గొప్పది. ‘అర్జున్ రెడ్డి’ సమయంలో డబ్బు, పలుకుబడి, ఫ్యాన్ బేస్ లేకుండానే మేము ఒక యుద్ధం చేశాం. ఆ సినిమా కోసం సందీప్ తండ్రి, ఆయన సోదరుడు ప్రణయ్ తమ వ్యవసాయ భూములు అమ్మి అన్నీ పణంగా పెట్టారు. అటువంటి సందీప్ పిలిస్తే నేను రాకపోతే ఎలా? నా కోసం సందీప్, సందీప్ కోసం నేను ఎక్కడికైనా వెళ్తాం” అని అన్నారు. భద్రకాళి పిక్చర్స్ లోగో చూస్తే ఇప్పటికీ తనకు ‘అర్జున్ రెడ్డి’ నేపథ్య సంగీతమే గుర్తుకొస్తుందని, ఆ సంస్థను తన సొంత బ్యానర్‌లా భావిస్తానన్నారు.
ఈ చిత్ర హీరో సుమంత్ ప్రభాస్‌పై విజయ్ ప్రశంసలు కురిపించారు. “కొన్నేళ్ల క్రితం ‘రౌడీ వేర్’ ఆఫీస్‌లో సుమంత్ కళ్లలో ఒక కసిని, ఆకలిని చూశాను. తను నటుడిగా మారినా, దర్శకుడిగా ప్రయత్నించినా తప్పకుండా మద్దతు ఇవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఫలితంతో సంబంధం లేకుండా అతనికి ఎప్పుడూ అండగా ఉంటాను” అని హామీ ఇచ్చారు.
యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, నటి రష్మిక మందన్నకు చిన్న గాయమైందని, ప్రస్తుతం ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. ఇక, తన జీవితంలో ‘రోమాంచకం’ కలిగించిన క్షణం ఏదని అడగ్గా.. 1989లో తాను పుట్టినప్పటి నుంచి గడిచిన ప్రతి క్షణం రోమాంచకమేనని బదులిచ్చి అందరినీ ఉత్సాహపరిచారు. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.