భార్యను దూషించారని.. గోదావరిలో దూకిన సాయికృష్ణ, శిరీష.. వైరల్ అవుతున్న ఆడియో

Sai Krishna and Sirisha jump into Godavari after wife was abused viral audio
  • పశ్చిమ గోదావరి జిల్లాలో దంపతుల ఆత్మహత్యాయత్నం
  • చించినాడ వంతెనపై నుంచి గోదావరిలోకి దూకిన భార్యాభర్తలు
  • ఉంగరం వివాదంలో అవమానం భరించలేకే ఈ నిర్ణయమని ఆడియోలో వెల్లడి
  • ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాల గాలింపు
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వంతెనపై నుంచి దంపతులు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. భీమవరానికి చెందిన దొడ్డ వెంకట ధనసాయికృష్ణ (32), ఆయన భార్య శిరీష (28) గురువారం రాత్రి ఈ అఘాయిత్యానికి పాల్పడగా, సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శుక్రవారం రోజంతా గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ వారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

సుమారు రూ. 50 వేల విలువైన ఉంగరం విషయంలో తలెత్తిన వివాదమే ఈ కఠిన నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం ఒక వ్యక్తి నుంచి సాయికృష్ణ ఉంగరాన్ని తాకట్టుగా తీసుకున్నారు. అయితే, దానిని తిరిగి ఇచ్చే విషయంలో జాప్యం జరగడంతో, సదరు వ్యక్తి మరికొందరితో కలిసి వచ్చి దంపతులను తీవ్రంగా అవమానించినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేధింపులు భరించలేకే వారు ఈ అడుగు వేశారని ఆరోపిస్తున్నారు.

కాగా, ఈ ఘటనకు ముందు సాయికృష్ణ మాట్లాడినట్లుగా భావిస్తున్న ఒక ఆడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉంగరం విషయంలో ఎదురైన అవమానాలు, ముఖ్యంగా తన భార్య పట్ల జరిగిన దూషణలను తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, తమ మరణానికి ఎవరూ బాధ్యులు కారని ఆ సందేశంలో పేర్కొన్నారు. మరోవైపు, తమ కవల పిల్లల్లో ఒకరైన కుమారుడిని బైక్‌పై ఒడ్డున వదిలిపెట్టి, ఆ బాలుడు చూస్తుండగానే వారు నదిలోకి దూకడం కలిచివేస్తోంది. పోలీసులు ఆ చిన్నారిని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన‌ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.                                
Advertisement
Sai Krishna
Godavari River suicide attempt
Chinchinada Bridge incident
West Godavari news
Viral audio message
Bhimavaram couple

More Telugu News