విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari inaugurates new NTR Trust building in Vijayawada
  • బ్లడ్ బ్యాంక్‌తో పాటు తలసేమియా కేర్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చిన ట్రస్ట్
  • విజయవాడ పరిసర ప్రాంతాల్లోని పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యం
  • ఇప్పటికే పలు నగరాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ రక్తనిధి కేంద్రాల నిర్వహణ
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించింది. విజయవాడలోని స్టెల్లా కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన ట్రస్ట్ భవనాన్ని, రక్తనిధి కేంద్రాన్ని ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గతేడాది శంకుస్థాపన జరుపుకున్న ఈ భవన నిర్మాణాన్ని ట్రస్ట్ విజయవంతంగా పూర్తి చేసింది.

విజయవాడ పరిసర ప్రాంతాల్లోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బ్లడ్ బ్యాంక్‌తో పాటు, తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ఉచితంగా రక్తాన్ని అందించేందుకు ప్రత్యేకంగా తలసేమియా కేర్ సెంటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రారంభమైన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు విస్తృతంగా వైద్య ఆరోగ్య సేవలు అందిస్తోంది. ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరంలో రక్తనిధి కేంద్రాలను నిర్వహిస్తుండగా, తాజాగా విజయవాడలోనూ ఈ సేవలు ప్రారంభమయ్యాయి. వీటితో పాటు అన్ని నియోజకవర్గాల్లో ‘ఎన్టీఆర్ ఆరోగ్య రథం’ పేరుతో మొబైల్ క్లినిక్‌ల ద్వారా కూడా వైద్య సేవలను ప్రజల వద్దకే తీసుకెళుతోంది.
Advertisement
Nara Bhuvaneshwari
NTR Memorial Trust
Vijayawada
NTR Trust Blood Bank
Thalassemia Care Center
NTR Arogya Ratham

More Telugu News