దేశం విడిచి వెళ్లాలని నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. స్పందించిన జీవిత భాగస్వామి లేఖా వాషింగ్టన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశం విడిచి వెళ్లాలని నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. స్పందించిన జీవిత భాగస్వామి లేఖా వాషింగ్టన్

Actor Imran Khan ordered to leave the country partner Lekha Washington reacts
  • నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు దేశం విడిచి వెళ్లాలంటూ నోటీసులు
  • నిరసనలో పాల్గొన్నందుకు అక్టోబర్ 28లోగా భారత్ వీడాలని ఆదేశం
  • పోలీసు వ్యాన్‌లోని ఫొటోను షేర్ చేసిన భాగస్వామి లేఖా వాషింగ్టన్
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ఊహించని షాక్ ఇచ్చింది. అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్, అక్టోబర్ 28వ తేదీలోగా భారతదేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేసింది. ఇటీవల ముంబైలో జరిగిన సీజేపీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకుగాను ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నోటీసులను బాంబే హైకోర్టులో సవాల్ చేసేందుకు ఇమ్రాన్ ఖాన్ సిద్ధమవుతున్నారు.

వివరాల్లోకి వెళితే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదానంలో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ తన భాగస్వామి, నటి లేఖా వాషింగ్టన్, కజిన్ జయాన్ మేరీ ఖాన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని, అదే రోజు రాత్రి విడుదల చేశారు. అయితే, విదేశీ పౌరసత్వం ఉన్న వ్యక్తి రాజకీయ నిరసనలో పాల్గొనడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని బీజేపీ నేత కిరీట్ సోమయ్య చేసిన ఫిర్యాదు మేరకు FRRO ఈ నోటీసులు జారీ చేసింది.

ఈ పరిణామంపై ఇమ్రాన్ ఖాన్, లేఖా వాషింగ్టన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అప్పట్లో పోలీసు వ్యాన్‌లో ఇమ్రాన్‌తో కలిసి దిగిన ఫొటోను ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 'జస్ట్' అనే క్యాప్షన్‌తో పాటు హార్ట్ ఎమోజీలతో పోస్ట్ చేశారు. గతంలోనూ ఆమె ఈ ఘటనపై స్పందిస్తూ... తాము నిరసనలో పాల్గొనడానికి వెళ్లలేదని, అదుపులోకి తీసుకున్న తమ స్నేహితుల గురించి తెలుసుకోవడానికి వెళ్లామని, ఆ సమయంలో పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించి గాయపరిచారని ఆరోపించారు.
Advertisement
Imran Khan
Lekha Washington
FRRO Notice
Imran Khan US Citizenship
Mumbai CJP Protest
Bombay High Court

More Telugu News