డ్రైవర్ల ఉద్యోగాలపై ఏఐ నిర్ణయాలు.. ఉబర్‌కు రూ.9,245 కోట్ల షాక్
- డ్రైవర్ల ఖాతాలపై ఏఐ నిర్ణయాలే కారణం
- మానవ పర్యవేక్షణ లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణ
- తక్కువ రేటింగ్‌లతో ఖాతాలు నిలిపివేశారని నియంత్రణ సంస్థ వెల్లడి
- ఆరోపణలను ఖండించిన ఉబర్.. అప్పీల్‌కు సిద్ధం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్ణయంతో ఉద్యోగం కోల్పోవాల్సి వస్తే? ఈ ప్రశ్న ఇప్పుడు యూరప్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. డ్రైవర్ల ఖాతాలను నిలిపివేయడంలో ఆటోమేటెడ్ వ్యవస్థలను ఉపయోగించినందుకు ఉబర్‌కు భారీ జరిమానా పడింది.
నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఉబర్‌పై 825 మిలియన్ యూరోల జరిమానా విధించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.9,245 కోట్లకు సమానం. యూరప్ జీడీపీఆర్ నిబంధనల కింద ఇప్పటివరకు విధించిన రెండో అతిపెద్ద జరిమానాగా ఇది నిలిచింది.
కొంతమంది డ్రైవర్ల ఖాతాలను ఉబర్ తగిన సమాచారం ఇవ్వకుండానే డీయాక్టివేట్ చేసిందని నెదర్లాండ్స్ నియంత్రణ సంస్థ ఆరోపించింది. నిర్ణయం తీసుకునే ముందు అర్థవంతమైన మానవ పర్యవేక్షణ కూడా లేదని పేర్కొంది.
కస్టమర్ల నుంచి తక్కువ రేటింగ్‌లు రావడం వంటి కారణాలతో కంప్యూటర్ ఆధారిత నిర్ణయాల ద్వారా కొందరు డ్రైవర్ల ఖాతాలను శాశ్వతంగా నిలిపివేసినట్లు తెలిపింది. ఇలాంటి ప్రభావం చూపే నిర్ణయాలను కంప్యూటర్ స్వయంగా తీసుకోకూడదని డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ డిప్యూటీ ఛైర్ మోనిక్ వెర్డియర్ అన్నారు.
నియంత్రణ సంస్థ ఆరోపణలను ఉబర్ ఖండించింది. ఆటోమేటెడ్ వ్యవస్థ ఆధారంగా మాత్రమే డ్రైవర్లను శాశ్వతంగా డీయాక్టివేట్ చేయలేదని స్పష్టం చేసింది. చాలా సస్పెన్షన్లు తాత్కాలికమేనని తెలిపింది. శాశ్వత తొలగింపులకు మానవ పరిశీలన ఉంటుందని పేర్కొంది. నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం డ్రైవర్లకు ఉందని చెప్పింది. జరిమానాపై అప్పీల్ చేయనున్నట్లు వెల్లడించింది.
ఫ్రాన్స్‌లోని ఉబర్ డ్రైవర్ల ఫిర్యాదులతో ఈ వ్యవహారం మొదలైంది. మాజీ డ్రైవర్ బ్రహీమ్ బెన్ అలీ 2019లో తన ఖాతా డీయాక్టివేట్ చేశారని వెల్లడించాడు. అనంతరం సుమారు 170 మంది డ్రైవర్ల వాంగ్మూలాలను సేకరించి నెదర్లాండ్స్‌లో ఫిర్యాదు చేశాడు.
జీడీపీఆర్ నిబంధనల ప్రకారం ఉద్యోగం, ఆదాయం వంటి అంశాలపై గణనీయమైన ప్రభావం చూపే నిర్ణయాలను కంపెనీలు పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థలపై ఆధారపడి తీసుకోరాదు. మానవ పరిశీలనతో పాటు నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం కల్పించాలి.