ఏపీ మద్యం రవాణా కేసు.. నాంపల్లి కోర్టుకు కారుమూరి నాగేశ్వరరావు

Karumuri Nageswara Rao produced in Nampally Court in AP Liquor Case
  • మద్యం రవాణా కాంట్రాక్టుల్లో అక్రమాలు జరిగాయంటూ కేసు
  • కోర్టుకు తీసుకెళ్లే ముందు గాంధీ ఆసుపత్రిలో కారుమూరికి వైద్య పరీక్షలు
  • ఇప్పటికే అరెస్ట్ అయిన కారుమూరి కుమారుడు సునీల్ కుమార్

ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణం కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈడీ కార్యాలయం నుంచి కోర్టుకు తీసుకెళ్లే ముందు ఆయనకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.


మద్యం రవాణా కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయని, ఈ అక్రమాల ద్వారా పెద్దమొత్తంలో ఆర్థిక లబ్ధి పొందినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కుమార్, అలాగే వాసుదేవరెడ్డి, రాజ్‌ కెసిరెడ్డిలను అధికారులు అరెస్టు చేశారు.

సోదాల సమయంలో సునీల్‌కుమార్ నివాసం నుంచి విలువైన రోలెక్స్ వాచీలతో పాటు రేంజ్‌రోవర్ వాహనాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా, ఈ కేసు విచారణలో భాగంగా కారుమూరికి చెందిన రూ.87.7 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే జప్తు చేసింది. నాంపల్లి కోర్టులో నిందితులను హాజరుపరిచిన అనంతరం తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి కోరే అవకాశం ఉంది.

Advertisement
Karumuri Nageswara Rao
AP Liquor Scam
Enforcement Directorate
Nampally Court
YSRCP Leader Arrest
Andhra Pradesh Excise Case

More Telugu News