అరటిపండ్లు త్వరగా పాడవుతున్నాయా? ఈ చిన్న చిట్కా పాటించండి

Are bananas spoiling quickly follow this simple tip to keep them fresh
  • అరటి కాడకు అల్యూమినియం ఫాయిల్‌ చుడితే ఎక్కువ కాలం తాజాగా వుంటాయి 
  • అరటిపండ్లు త్వరగా పండేలా చేసే ఇథిలీన్‌ వాయువు
  • అరటిపండ్లను విడిగా చుడితే మరింత ప్రభావం
  • ఎండకు దూరంగా గది ఉష్ణోగ్రతలో అరటిపండ్లను ఉంచాలి
  • యాపిల్‌, అవకాడో పక్కన అరటిపండ్లు పెట్టకపోవడం మంచిది
ఇంట్లో అరటిపండ్లు కొంటే రెండు మూడు రోజుల్లోనే మెత్తబడి, నల్లగా మారిపోతుంటాయి. దీంతో తినకుండానే కొన్ని పండ్లను పడేయాల్సి వస్తుంది. అయితే వంటింట్లో నిత్యం కనిపించే అల్యూమినియం ఫాయిల్‌తో అరటిపండ్లను కొంత ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు.

అరటిపండ్లు త్వరగా పండిపోవడానికి ప్రధాన కారణం ఇథిలీన్‌ వాయువు. ఇది ప్రధానంగా అరటి గెల కాడ భాగం నుంచి విడుదలవుతుంది. ఈ వాయువు వ్యాపించడంతో పండు వేగంగా మెత్తబడుతుంది. చివరకు మొత్తం గెల పాడయ్యే పరిస్థితి వస్తుంది.

ఇలాంటి సమయంలో చిన్న ముక్క అల్యూమినియం ఫాయిల్‌ తీసుకుని అరటి గెల కాడ చుట్టూ గట్టిగా చుట్టాలి. మరింత ప్రభావంగా పనిచేయాలంటే అరటిపండ్లను విడదీసి ఒక్కో పండు కాడకు విడిగా ఫాయిల్‌ చుట్టవచ్చు.

ఫాయిల్‌ చుట్టిన అరటిపండ్లను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. నేరుగా ఎండ పడే ప్రదేశాలకు దూరంగా పెట్టాలి. యాపిల్‌, అవకాడో వంటి ఇథిలీన్‌ ఎక్కువగా విడుదల చేసే పండ్ల పక్కన ఉంచకపోవడం మంచిది.

వెంటనే తినే అవసరం లేకపోతే కొద్దిగా పచ్చగా ఉన్న అరటిపండ్లను కొనడం మంచిది. గెలను హుక్‌కు వేలాడదీయడం వల్ల దెబ్బలు తగలకుండా ఉంటాయి. దెబ్బతిన్న ప్రాంతాల నుంచి ఇథిలీన్‌ ఎక్కువగా విడుదలై పండ్లు త్వరగా పాడవుతాయి.

అరటిపండ్లు బాగా పండిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టొచ్చు. తొక్క నల్లబడినా లోపలి పండు మరికొన్ని రోజులు బాగానే ఉంటుంది. మరీ ఎక్కువగా పండిపోయిన అరటిపండ్లను పడేయకుండా స్మూతీలు, బనానా బ్రెడ్‌ తయారీలో ఉపయోగించవచ్చు.
Advertisement
Bananas
Aluminum foil
Ethylene gas
Kitchen tips
Food preservation
Banana storage hacks

More Telugu News