స్వీట్స్ కల్తీ ఆరోపణలు.. అధికారుల తనిఖీల్లో సొంత స్వీటు తినేందుకు తిరస్కరించిన వ్యాపారి

Sweet shop owner refuses to eat his own sweets during food safety inspection
  • ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్‌ జిల్లాలో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు
  • కౌంటర్ లో ఉన్న స్వీట్ ను యజమానికి ఇచ్చి తినాలన్న అధికారి
  • చేతులు జోడించి నిరాకరించిన షాపు యజమాని

ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్‌ జిల్లాలో ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఒక విచిత్రమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక స్వీట్ షాప్‌లో కల్తీ పాల పదార్థాలు, నాణ్యత లేని స్వీట్లు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులతో జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సబ్‌ డివిజనల్ మేజిస్ట్రేట్ కరణ్‌వీర్ సింగ్, ఆహార భద్రతా శాఖ , పోలీసు అధికారులు షాప్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా కౌంటర్‌లో అమ్మకానికి ఉంచిన స్వీట్ల నాణ్యతపై అనుమానం రావడంతో, అక్కడ ఉన్న ఒక పోలీసు అధికారి స్వీటును తీసి షాప్ యజమానికి ఇస్తూ దాన్ని తినాలని కోరారు.


అయితే, వినియోగదారులకు విక్రయిస్తున్న అదే స్వీటును తినేందుకు సదరు షాపు యజమాని చేతులు జోడించి నిర్ద్వంద్వంగా నిరాకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, షాపులోని స్వీట్లు కలుషితమయ్యాయనే అనుమానాలు మరింత బలపడ్డాయి.


వెంటనే స్పందించిన అధికారులు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించడమే కాకుండా, అక్కడ నిల్వ ఉంచిన స్వీట్లను వెంటనే పారవేయాలని ఆంక్షలు విధించారు. విచారణ నివేదికలో కల్తీ జరిగినట్లు రుజువైతే సదరు వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌డీఎం కరణ్‌వీర్ సింగ్ స్పష్టం చేశారు.

Advertisement
Sweet Shop Owner
Hamirpur Uttar Pradesh
Food Safety Inspection
Adulterated Sweets
SDM Karanveer Singh
Contaminated Food Raid

More Telugu News