అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు.. విద్యార్థులకు కీలక సూచన చేసిన హార్వర్డ్ యూనివర్శిటీ

Changes in US Visa Rules Harvard University Issues Key Guidelines for Students
  • ఎఫ్-1, జే-1 వీసా నిబంధనలలో మార్పు
  • సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్న మార్పులు
  • అమెరికా వెలుపల ఉన్న విద్యార్థులు ఆలోగా యూఎస్ చేరుకోవాలన్న హార్వర్డ్

అమెరికా జాతీయ భద్రతా శాఖ ఎఫ్-1, జే-1 వీసా నిబంధనలలో తీసుకువస్తున్న మార్పులపై ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీ తన అంతర్జాతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్న నూతన వీసా మార్గదర్శకాల నేపథ్యంలో, విదేశీ ప్రయాణాల్లో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు సెప్టెంబర్ 15 నాటికి అమెరికాకు తిరిగి చేరుకోవాలని సూచించింది.


విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు ఎలాంటి కాలపరిమితి లేకండా అమెరికాలో ఉండేందుకు ఉన్న 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' విధానాన్ని తొలగిస్తున్నారు. దీని స్థానంలో గరిష్ఠంగా 4 ఏళ్ల పరిమితి ఉండేలా లేదా కోర్సు వ్యవధికి సరిపడా నిర్దిష్టమైన ముగింపు తేదీతో కూడిన కొత్త విధానాన్ని తీసుకువస్తున్నారు. 


ఇప్పటికే అమెరికాలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు కొత్త నిబంధనల నుంచి కొంత మినహాయింపు ఉంటుంది. అయితే, సెప్టెంబర్ 15 తర్వాత ఎవరైనా అమెరికా వెలుపలకు ప్రయాణించి తిరిగి ప్రవేశిస్తే, వారికి కొత్త నిబంధనలే వర్తిస్తాయి. అందువల్ల, ఇబ్బందులు రాకుండా ఉండాలంటే సెప్టెంబర్ 15కు ముందే క్యాంపస్‌కు చేరుకోవాలని విశ్వవిద్యాలయం సిఫార్సు చేస్తోంది.


4 ఏళ్ల కంటే ఎక్కువ సమయం అవసరమయ్యే విద్యార్థులు 'యూఎస్ సీఐఎస్' ద్వారా ప్రత్యేకంగా పొడిగింపును అభ్యర్థించాల్సి ఉంటుంది. అలాగే, కోర్సు పూర్తయ్యాక దేశం విడిచివెళ్లడానికి ఉండే గ్రేస్ పీరియడ్‌ను కూడా నిబంధనల ఆధారంగా తగ్గించనున్నారు.

Advertisement
Harvard University
US Visa Rules
F1 J1 Visa Changes
International Students USA
Department of Homeland Security
US Student Visa Policy

More Telugu News