తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటలే!
- తిరుమలలో సాధారణ రద్దీ
- 22 కంపార్ట్‌మెంట్లలో వేచి చూస్తున్న భక్తులు
- శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు
- నిన్న స్వామివారిని దర్శించుకున్న 84 వేల మంది భక్తులు
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి కేవలం 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 22 కంపార్ట్‌మెంట్‌లలో మాత్రమే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండటంతో కొండపై రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది.
నిన్న శనివారం (ఆగస్టు 22) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే మొత్తం 84,873 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 36,286 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
శనివారం శ్రీవారి హుండీ ద్వారా రూ. 3.67 కోట్ల కానుకలు లభించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా, టీటీడీ 4.38 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించగా, 2.42 లక్షల మందికి అన్నప్రసాదం అందించింది. తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో 3,523 మందికి వైద్య సేవలు అందించినట్లు టీటీడీ పేర్కొంది.