తెలంగాణలో ఎల్లో అలర్ట్.. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- తెలంగాణలో మంగళవారం వరకు భారీ వర్షాలు
- వాతావరణ శాఖ నుంచి ఎల్లో అలర్ట్ జారీ
- హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మంగళవారం (ఆగస్టు 25) వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సంభవించే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రానికి 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో ఆగస్టు 25 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శనివారం నగరంలోని షేక్‌పేటలో అత్యధికంగా 43.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం, నిన్న రాష్ట్రంలో అత్యధికంగా కుమురం భీం జిల్లాలో 66 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.