మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో కీలక అరెస్ట్

Minister Konda Surekha former OSD case key arrest made by police
  • వ్యాపారిపై దాడి, బెదిరింపుల కేసులో సుమంత్ డ్రైవర్ అరెస్ట్
  • రూ.10 కోట్లు డిమాండ్ చేశారని బాధితుడు హరికృష్ణ ఆరోపణ
  • దాడిలో చేయి విరిగిందని పోలీసులకు ఫిర్యాదు
  • తెల్లాపూర్‌లో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సుమంత్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సుమంత్‌ వ్యక్తిగత డ్రైవర్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్‌లోని సుమంత్ నివాసం సమీపంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

బోడుప్పల్‌కు చెందిన వ్యాపారి గొంగిడి హరికృష్ణ (36)పై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడిన కేసులో సుమంత్‌తో పాటు ప్రశాంత్, రాము, కార్తీక్ అరుణ్ కుమార్ రెడ్డి, మహేందర్ రెడ్డిలపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.

నిందితులు తనను రూ.10 కోట్లు డిమాండ్ చేశారని, ఆ నగదు ఇచ్చేందుకు నిరాకరించడంతో తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని హరికృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో తన ఎడమ చేయి ఫ్రాక్చర్ అవ్వడమే కాకుండా ఇతర గాయాలయ్యాయని వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా సుమంత్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Sumanth
Konda Surekha
Telangana Police
Gongidi Harikrishna
Extortion Case
Tellapur

More Telugu News