హోటల్ గదికి రమ్మన్నాడు.. ఆ తర్వాత సినిమా నుంచి తీసేశాడు: విద్యా బాలన్
- కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్న విద్యా బాలన్
- చెన్నైలో ఓ దర్శకుడు హోటల్ గదికి రమ్మని పట్టుబట్టాడని వెల్లడి
- సమయస్ఫూర్తితో గది తలుపు తెరిచే ఉంచడంతో అతను వెళ్లిపోయాడని వెల్లడి
ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవం గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ దర్శకుడు తనను హోటల్ గదికి రమ్మని బలవంతం చేశాడని, ఆ తర్వాత తనను సినిమా నుంచి తొలగించాడని ఆమె వెల్లడించారు.
చెన్నైలో ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని విద్యా బాలన్ గుర్తుచేసుకున్నారు. అప్పటికే ఓ సినిమాకు సంతకం చేసిన తాను, ఆ చిత్ర దర్శకుడిని కలవాల్సి వచ్చిందన్నారు. "కాఫీ షాప్లో కలుద్దామని నేను చెప్పినా, అతను మాత్రం హోటల్ గదికి వెళ్లి మాట్లాడుకుందామని పదేపదే పట్టుబట్టాడు. అతని ఉద్దేశంపై అనుమానం రావడంతో, గదిలోకి వెళ్లాక నేను సమయస్ఫూర్తితో తలుపు తెరిచే ఉంచాను. దీంతో ఐదు నిమిషాల్లోనే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు" అని విద్యా బాలన్ వివరించారు.
అయితే, ఈ సంఘటన తర్వాత తనను ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించారని ఆమె పేర్కొన్నారు. ఆ దర్శకుడు ఎలాంటి తప్పుడు ప్రతిపాదన చేయనప్పటికీ, అతని ప్రవర్తనలోని ఉద్దేశాన్ని గ్రహించి అలా ప్రవర్తించానని తెలిపారు. ఇది పూర్తిస్థాయి క్యాస్టింగ్ కౌచ్ అనుభవం కాకపోయినా, స్వీయరక్షణ కోసం అప్రమత్తంగా వ్యవహరించానని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో తనకు ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఎదురుకాలేదని, ఈ విషయంలో తాను అదృష్టవంతురాలినని విద్యా బాలన్ అన్నారు. ఏ అవకాశం కూడా భద్రతను పణంగా పెట్టేంత పెద్దది కాదని చెప్పారు.