బెంగళూరు ప్రయాణికులకు గుడ్‌న్యూస్!.. భారీగా తగ్గిన ఎయిర్‌పోర్ట్ ఫీజు
- బెంగళూరు ఎయిర్‌పోర్ట్ యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు భారీగా తగ్గింపు
- సెప్టెంబర్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి
- దేశీయ ప్రయాణికులకు డిపార్చర్ ఫీజు రూ. 550 నుంచి రూ.300కి కట్
- తొలిసారిగా వచ్చిన ప్రయాణికులపై కూడా కొత్తగా ఫీజు విధింపు
- అంతర్జాతీయ ప్రయాణికులకు ఫీజు రూ.1,500 నుంచి రూ.997కి తగ్గింపు
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారికి శుభవార్త. ఎయిర్‌పోర్ట్ యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యూడీఎఫ్)ను ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఈఆర్ఏ) భారీగా తగ్గించింది. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఐదేళ్ల కాలానికి (2026 ఏప్రిల్ - 2031 మార్చి) కొత్త టారిఫ్ ఆర్డర్‌ను విడుదల చేసింది. ఈసారి తొలిసారిగా విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులపై కూడా ఫీజు విధించడం గమనార్హం.
తాజా సవరణ ప్రకారం, దేశీయ విమానాల్లో బయలుదేరే ప్రయాణికులు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ. 550 స్థానంలో ఇకపై రూ. 300 చెల్లిస్తే సరిపోతుంది. అంటే, దాదాపు 45 శాతం మేర ఫీజు తగ్గింది. అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ ఫీజు రూ. 1,500 నుంచి రూ. 997కు తగ్గింది. ఇది సుమారు 34 శాతం తక్కువ. మరోవైపు, బెంగళూరుకు వచ్చే దేశీయ ప్రయాణికులు రూ. 125, అంతర్జాతీయ ప్రయాణికులు రూ. 426 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన ప్రయాణికులపై ఎలాంటి ఫీజు లేదు.
ఈ మార్పులతో, బెంగళూరు నుంచి రానుపోను ప్రయాణించే దేశీయ ప్రయాణికుడు మొత్తం రూ. 425 (వెళ్లేటప్పుడు రూ. 300 + వచ్చేటప్పుడు రూ. 125) చెల్లిస్తారు. గతంలో ఇది వెళ్లేటప్పుడు రూ. 550గా ఉండేది. ఈ ఫీజును విమాన టికెట్ ధరలోనే కలిపి వసూలు చేస్తారు. రెండేళ్లలోపు పిల్లలు, దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లు, విధి నిర్వహణలో ఉన్న విమాన సిబ్బందికి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. దేశీయ విమానయానాన్ని ప్రోత్సహించేందుకే ఈ ఫీజులను తగ్గించినట్లు ఏఈఆర్ఏ తెలిపింది. ఎయిర్‌పోర్ట్‌లో 84 శాతం మంది దేశీయ ప్రయాణికులే ఉండటం దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది.