ఇక నుంచి కేటీఆర్ మమ్మల్ని గోకకపోయినా.. నేను గోకుతూనే ఉంటా!: వెంకట్ బల్మూర్
Add ap7am to your home Screen

ఇక నుంచి కేటీఆర్ మమ్మల్ని గోకకపోయినా.. నేను గోకుతూనే ఉంటా!: వెంకట్ బల్మూర్

Venkat Balmoor says even if KTR does not provoke I will keep provoking him
  • కేటీఆర్ బాగోతాలను ప్రతీ వారం సీరియల్‌లా బయటపెడతానన్న వెంకట్ బల్మూర్
  • ఆయన ఇంటికి, పార్టీ ఆఫీసుకు 'గోకుడు మందు' పంపిస్తున్నట్లు వెల్లడి
  • డెక్కన్ సెరాయ్ హోటల్ వ్యాపారంపై విచారణ జరపాలని డిమాండ్
  • ఓ సినీ నటితో చేసిన చాటింగ్‌ను కేటీఆర్ ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్న
  • కేసీఆర్, కేటీఆర్ మధ్య మాటలు లేవని, మధ్యవర్తిత్వం జరుగుతోందని వ్యాఖ్య
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ వెంకట్ బల్మూర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ వ్యవహారశైలిపై సంచలన ఆరోపణలు చేసిన ఆయన, ఇకపై ప్రతీ వారం ఒక సీరియల్ లాగా ఆయన బాగోతాలను బయటపెడతానని హెచ్చరించారు. "ఇక నుంచి కేటీఆర్ మమ్మల్ని గోకకపోయినా, నేను గోకుతూనే ఉంటా" అని వ్యాఖ్యానించిన బల్మూర్, కేటీఆర్ ఇంటికి, పార్టీ ఆఫీసుకు 'గోకుడు మందు' (ఇచ్ గార్డ్) పంపిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా వెంకట్ బల్మూర్ మాట్లాడుతూ.. తాము కేటీఆర్ బాగోతాలు బయటపెడితే, బీఆర్ఎస్ నేతలు తమ ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. 2019 నుంచి 2022 మధ్య ఓ సినీ నటితో జరిపిన సోషల్ మీడియా సంభాషణలను కేటీఆర్ ఎందుకు డిలీట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ హోటల్ వ్యాపార రహస్యాలు ప్రజల ముందు ఉంచాలన్నారు. "2015లో రూ.5 కోట్లుగా ఉన్న డెక్కన్ సెరాయ్ హోటల్ షేర్ విలువ, పదేళ్లలో రూ.175 కోట్లకు ఎలా పెరిగింది? ఈ అంశంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి విచారణ కోరతాం" అని స్పష్టం చేశారు.

ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే కేటీఆర్, పాస్‌పోర్ట్ సీజ్ చేయాలన్న పోలీసుల అభ్యర్థనపై కోర్టును ఎందుకు ఆశ్రయించారని బల్మూర్ ప్రశ్నించారు. కేటీఆర్ చెప్పేవి నీతి మాటలని, చేసేవి అవినీతి పనులని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌ను అరికట్టేందుకు కృషి చేస్తుంటే, కేటీఆర్ డ్రగ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతున్నారని తీవ్ర ఆరోపణ చేశారు.

తాను చెప్పేవన్నీ అబద్ధాలైతే కేటీఆర్ లైవ్‌లోకి వచ్చి వాస్తవాలు చెప్పాలని, డ్రగ్ టెస్టుకు సిద్ధమని ప్రకటించాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం కేసీఆర్ కూడా కేటీఆర్‌తో మాట్లాడటం లేదని, తండ్రీకొడుకుల మధ్య పంచాయతీని నవీన్ రావు తండ్రి కొండల్ రావు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని బల్మూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఎందుకు ఎవరితో కలవడం లేదో బీఆర్ఎస్ మిత్రులు కూడా ఆలోచించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, ఫాంహౌస్ లో కేటీఆర్ కు రహస్య ట్రీట్ మెంట్ అంటూ సంచలన ట్వీట్లు కూడా చేశారు. 
Advertisement
KTR
Venkat Balmoor
BRS Party
Deccan Serai Hotel
Telangana Politics
KTR Drug Allegations

More Telugu News