జేఈఈలో రెండుసార్లు ఫెయిల్.. యూట్యూబ్‌లో నేర్చుకుని నెలకు రూ.2 లక్షలు!
- యూట్యూబ్ ద్వారా ప్రొడక్ట్ డిజైన్ నేర్చుకున్న ఇండోర్ యువకుడు
- ప్రస్తుతం ఫ్రీలాన్సర్‌గా నెలకు రూ.2 లక్షల వరకు సంపాదన
- రాత్రి వేళల్లో యూట్యూబ్‌లో ఉన్న ఉచిత ట్యుటోరియల్స్‌తో ప్రొడక్ట్ డిజైన్‌పై పట్టు
- అతడి గురించి అంకుర్ వారికూ చేసిన పోస్ట్ వైరల్
- భారత్‌లో విద్యార్హతలకు ఇస్తున్న ప్రాధాన్యంపై చర్చ
ఇండోర్‌కు చెందిన ఓ యువకుడి సక్సెస్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ‘జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్’ (జేఈఈ)లో రెండుసార్లు విఫలమైన ఆ యువకుడు సంప్రదాయ విద్యా మార్గాన్ని పక్కనపెట్టి యూట్యూబ్ ద్వారా ప్రొడక్ట్ డిజైన్ నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూ నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, వ్యాపారవేత్త అంకుర్ వారికూ వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
జేఈఈలో విజయం సాధించలేకపోయిన తర్వాత ఆ యువకుడు రాత్రి వేళల్లో యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఉచిత ట్యుటోరియల్స్‌ను ఉపయోగించుకుని ప్రొడక్ట్ డిజైన్ నేర్చుకున్నట్లు వారికూ తెలిపారు. క్రమంగా తన నైపుణ్యాన్ని పెంచుకుని ప్రొఫెషనల్ పోర్ట్‌ఫోలియోను తయారు చేసుకున్నాడని చెప్పారు. ప్రస్తుతం అతడు సంపాదిస్తున్న ఆదాయం నెలకు రూ.2 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివిన పలువురు గ్రాడ్యుయేట్ల కంటే అతడి పోర్ట్‌ఫోలియో మెరుగ్గా ఉందని వారికూ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా అంకుర్ వారికూ భారత్‌లో విద్యార్హతలకు ఇస్తున్న ప్రాధాన్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఒక వ్యక్తి ప్రతిభను అతను ఏ కాలేజీలో చదివాడు, ఏ డిగ్రీ సాధించాడు, ఏ సంస్థలో పనిచేస్తున్నాడనే అంశాలతోనే నిర్ణయించడం సరికాదన్నారు. మన దేశంలో ప్రతిభకు కొదవ లేదని.. అయితే ప్రముఖ విద్యాసంస్థ పేరు, డిగ్రీ లేదా పెద్ద కంపెనీ ఉద్యోగం ఉంటేనే సామర్థ్యం ఉన్న వ్యక్తిగా గుర్తించే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.
సంప్రదాయ విద్యార్హతలు ఒక వ్యక్తి గతంలో ఎక్కడ ఉన్నాడో తెలియజేస్తాయని, కానీ భవిష్యత్తులో అతను ఎంత దూరం వెళ్లగలడో అవి నిర్ణయించలేవని వారికూ పేర్కొన్నారు. మారుతున్న కాలంలో విద్యతో పాటు స్వయంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం కూడా ముఖ్యమని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ముఖ్యంగా యూట్యూబ్, ఆన్‌లైన్ కోర్సులు, ఉచిత డిజిటల్ వనరుల ద్వారా యువత కొత్త నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు పెరిగాయని పలువురు పేర్కొంటున్నారు.
అయితే ఈ విజయగాథపై సోషల్ మీడియాలో అందరూ ఏకీభవించలేదు. ఇలాంటి ఉదాహరణలను సాధారణ విజయ మార్గంగా చూపించడం సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు. జేఈఈలో రెండుసార్లు విఫలమైన వ్యక్తి నెలకు రూ.2 లక్షలు సంపాదించడం ఒక అసాధారణ ఉదాహరణ మాత్రమేనని, అందరికీ ఇదే ఫలితం వస్తుందని చెప్పలేమని కామెంట్లు చేశారు. మరోవైపు ఐఐఠృ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సాధించడం కూడా కఠినమైన పోటీని ఎదుర్కొని సాధించే ప్రతిభకు నిదర్శనమేనని మరికొందరు వాదించారు.
దీంతో డిగ్రీ, కాలేజీ పేరు కంటే నైపుణ్యమే ముఖ్యమా? లేక రెండింటికీ సమాన ప్రాధాన్యం ఉందా? అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇండోర్ యువకుడి కథ మాత్రం సంప్రదాయ విద్యా మార్గానికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ వనరులను ఉపయోగించుకుని నైపుణ్యాలు పెంచుకోవడంపై ఆసక్తిని పెంచుతోంది.