టీఐఎస్ఎస్ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్ దూరం
- టీఐఎస్ఎస్ 86వ స్నాతకోత్సవ అతిథి జాబితా నుంచి సీజేఐ సూర్యకాంత్ పేరు తొలగింపు
- ఆయన స్థానంలో టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రమేశ్‌కు ఆహ్వానం
- నిరసనల భయంతోనే కార్యక్రమం వాయిదా పడినట్లు గతంలో ప్రచారం
- హైదరాబాద్ నల్సార్ వివాదం నేపథ్యంలో తాజా పరిణామం
- 22న స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించిన టీఐఎస్ఎస్
టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) 86వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథుల జాబితాలో కీలక మార్పు జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సి.ఎస్.ప్రమేశ్‌ను కొత్త ముఖ్య అతిథిగా టీఐఎస్ఎస్ ప్రకటించింది. వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 22న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
వాస్తవానికి ఈ స్నాతకోత్సవాన్ని ఆగస్టు 2న నిర్వహించాలని నిర్ణయించి, సీజేఐ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే, కార్యక్రమానికి రెండు రోజుల ముందు 'ఊహించని కారణాల వల్ల', 'అనుకూల వాతావరణం లేనందున' వాయిదా వేస్తున్నట్లు టీఐఎస్ఎస్ ప్రకటించింది. సీజేఐ రాక సందర్భంగా విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని, భద్రతాపరమైన ఆందోళనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇటీవల హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి సీజేఐని ఆహ్వానించాలన్న ప్రతిపాదనను అక్కడి విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కొన్ని కేసుల విచారణ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను వారు ప్రస్తావించారు. అయితే, తాను నల్సార్ నుంచి ఎలాంటి ఆహ్వానాన్ని అంగీకరించలేదని, కాబట్టి హాజరయ్యే ప్రశ్నే తలెత్తదని సీజేఐ కార్యాలయం అప్పట్లో స్పష్టం చేసింది.
ఈ వివాదం జరిగిన కొన్ని రోజులకే టీఐఎస్ఎస్ స్నాతకోత్సవానికి కూడా సీజేఐ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా జారీ చేసిన ఆహ్వానపత్రంలో సీజేఐ పేరును తొలగించి, డాక్టర్ ప్రమేశ్ పేరును చేర్చారు. అయితే, సీజేఐ కార్యాలయం స్వయంగా పర్యటనను రద్దు చేసుకుందా? లేక టీఐఎస్ఎస్ సంస్థాగతంగా ఈ నిర్ణయం తీసుకుందా? అనే విషయంపై స్పష్టత లేదు.