ముందు మీ భద్రత మీరు చూసుకోండి.. పాక్‌కు తాలిబన్ల స్ట్రాంగ్ కౌంటర్

Taliban strong counter to Pakistan look after your own security first
  • ఉగ్రవాదంపై పాకిస్థాన్ ఆరోపణలను ఖండించిన తాలిబన్లు
  • పాకిస్థానే ఐసిస్, ఆఫ్ఘన్ వ్యతిరేక గ్రూపులకు ఆశ్రయం ఇస్తోందని ఆరోపణ
  • తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిక
తమ దేశం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పాకిస్థాన్ ఆరోపణలను ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇతరులపై నిందలు వేయడం మానుకుని, ముందుగా తమ దేశ భద్రతా సమస్యలను పరిష్కరించుకోవాలని పాకిస్థాన్‌కు హితవు పలికింది.

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి ఇటీవల మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో తాలిబన్లు విఫలమయ్యారని, ఆఫ్ఘన్ గడ్డను పాక్‌పై దాడులకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్ వ్యాఖ్యలు తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని అన్నారు.

సరిహద్దు దాటి ఉగ్రవాదులు తమ దేశం నుంచి వస్తున్నారనే ఆరోపణలను ముజాహిద్ తోసిపుచ్చారు. పాకిస్థాన్ తన సొంత భద్రతా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఆఫ్ఘన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా, పాకిస్థానే ఐసిస్ (దాయిష్) ఉగ్రవాదులకు, ఆఫ్ఘన్ వ్యతిరేక గ్రూపులకు ఆశ్రయం కల్పిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఆఫ్గానిస్థాన్‌లోని సాయుధ గ్రూపులకు పాక్ మద్దతిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. పొరుగు దేశాలపై నిందలు వేయడం కంటే, తమ అంతర్గత భద్రతా సమస్యలపై దృష్టి పెట్టాలని పాకిస్థాన్‌కు ఆయన సూచించారు.  
Advertisement
Taliban
Pakistan
Zabihullah Mujahid
Afghanistan Pakistan relations
Cross border terrorism
Internal security

More Telugu News