జియో ప్రైమ్ రీలాంచ్.. రూ. 300కే ఏడాది పాటు టారిఫ్ గ్యారెంటీ!
- తిరిగి ప్రారంభమైన జియో ప్రైమ్ మెంబర్‌షిప్
- రూ. 300 ఫీజుతో ఏడాది పాటు టారిఫ్ గ్యారెంటీ
- 2027 సెప్టెంబర్ 5 వరకు పాత ధరలకే రీఛార్జ్
- సభ్యులకు రూ. 600 విలువైన క్యాష్‌బ్యాక్ వోచర్ల ఆఫర్
- టారిఫ్‌లు పెరుగుతున్న వేళ యూజర్లకు ఊరట
టెలికాం రంగంలో టారిఫ్‌ల పెంపుపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో, రిలయన్స్ జియో తన కస్టమర్లకు తీపి కబురు అందించింది. సంస్థ పదేళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, 'జియో ప్రైమ్' మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పునరుద్ధరించింది. ఇందులో భాగంగా రూ. 300 ఒకేసారి చెల్లించి, ఏడాది పాటు టారిఫ్‌లపై ధరల గ్యారెంటీ పొందవచ్చని వెల్లడించింది.
ఈ మెంబర్‌షిప్ తీసుకున్న యూజర్లు, తాము ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాన్‌లతోనే 2027 సెప్టెంబర్ 5 వరకు రీఛార్జ్‌లు చేసుకోవచ్చు. భవిష్యత్తులో టారిఫ్‌లు పెరిగినప్పటికీ, ప్రైమ్ సభ్యులకు పాత ధరలే వర్తిస్తాయని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లతో పాటు, ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియోకు మారే వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇటీవల ప్రత్యర్థి సంస్థ ఎయిర్‌టెల్ రూ. 299 ప్లాన్‌తో సహా పలు ఇతర ప్లాన్‌లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ అత్యంత ప్రజాదరణ పొందన రూ. 299 (రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్) ప్లాన్‌ను యథాతథంగా కొనసాగిస్తామని జియో ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జియో ప్రైమ్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ధరల గ్యారెంటీతో పాటు, ప్రైమ్ సభ్యులకు రూ. 600 విలువైన క్యాష్‌బ్యాక్ వోచర్లు కూడా లభిస్తాయి. కొత్త జియోహోమ్ లేదా జియోపీసీ కనెక్షన్‌పై రూ. 300, కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం కొత్త సిమ్ తీసుకుంటే మరో రూ. 300 వోచర్ అందజేస్తారు. వీటితో పాటు కొత్త ఉత్పత్తులు, సేవలకు ముందస్తు యాక్సెస్, ప్రత్యేక కస్టమర్ సపోర్ట్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.
మైజియో యాప్, జియో.కామ్, జియో స్టోర్లు, అధీకృత భాగస్వామ్య అవుట్‌లెట్‌ల ద్వారా ఈ మెంబర్‌షిప్‌ను పొందవచ్చు. గతంలో తొలి 10 కోట్ల మంది కస్టమర్ల కోసం ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ప్రవేశపెట్టగా, ప్రస్తుతం 50 కోట్లకు పైగా ఉన్న తన యూజర్ బేస్‌ను దృష్టిలో ఉంచుకుని జియో దీన్ని పునఃప్రారంభించింది.