వైసీపీ నేత చింతాడ రవికుమార్ కు బెయిల్
- మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసు
- చింతాడతో పాటు ఇతర నేతలకు బెయిల్ ఇచ్చిన ఆమదాలవలస కోర్టు
- బెయిల్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న వైసీపీ శ్రేణులు
మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో నమోదైన కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. ఆమదాలవలస కోర్టు చింతాడ రవికుమార్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇతరులకు కూడా బెయిల్ మంజూరు చేసింది. దీంతో వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు. చింతాడకు బెయిల్ రావడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.