ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పబోతున్న రొనాల్డో.. పెళ్లి తర్వాత షాకింగ్ కామెంట్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పబోతున్న రొనాల్డో.. పెళ్లి తర్వాత షాకింగ్ కామెంట్స్

Cristiano Ronaldo to say goodbye to football shocking comments after marriage
  • రహస్యంగా ఒక్కటైన ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో, జార్జినా రోడ్రిగ్జ్
  • పదేళ్ల పరిచయం రోజునే పెళ్లి బంధంతో ఒకటైన జంట
  • వోగ్ మ్యాగజైన్ ద్వారా బయటకొచ్చిన వివాహ చిత్రాలు
  • 2026-27 సీజన్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానన్న రొనాల్డో
  • 1000 గోల్స్ మైలురాయికి కేవలం 24 గోల్స్ దూరంలో ఫుట్‌బాల్ స్టార్
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన అభిమానులకు ఒకేసారి రెండు పెద్ద వార్తలు చెప్పాడు. తన సుదీర్ఘకాల భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ప్రకటించడంతో పాటు, తన రిటైర్మెంట్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ 'వోగ్' వీరి వివాహ చిత్రాలను అధికారికంగా విడుదల చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

పోర్చుగల్‌లోని కాస్కైస్‌లో ఉన్న తమ నివాసంలో అత్యంత నిరాడంబరంగా ఈ వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి వారి ఐదుగురు పిల్లలతో పాటు కేవలం నలుగురు సాక్షులు మాత్రమే హాజరయ్యారు. సరిగ్గా పదేళ్ల క్రితం 2016లో మాడ్రిడ్‌లోని గుస్సీ స్టోర్‌లో తొలిసారి కలుసుకున్న ఆగస్టు 11వ తేదీనే వీరు వివాహ బంధంతో ఒక్కటవ్వడం విశేషం.

ఈ సందర్భంగా జార్జినా 'వోగ్' మ్యాగజైన్‌తో మాట్లాడుతూ "చిన్నప్పుడు రాకుమారిలా గుర్రపు బగ్గీలో, వజ్రాల కిరీటంతో వైభవంగా పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. కానీ రోజూ విలాసవంతమైన జీవితాన్ని చూసే మాకు, ఇంట్లో పిల్లలు, భాగస్వామితో గడిపే ప్రశాంతమైన, వ్యక్తిగత సమయమే చాలా అరుదైనది. అందుకే ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాం" అని తన ఆనందాన్ని పంచుకుంది.

ఫుట్‌బాల్‌కు వీడ్కోలు ఎప్పుడంటే?
పెళ్లి వార్తతో పాటే, తన కెరీర్‌కు సంబంధించి 41 ఏళ్ల రొనాల్డో ఒక కీలక ప్రకటన చేశాడు. రాబోయే 2026-27 సీజన్ బహుశా తన చివరి సీజన్ కావచ్చని చెప్పాడు. "ఇది ఫుట్‌బాల్ మైదానంలో నా ఆఖరి ఏడాది కావచ్చు. 25 ఏళ్లుగా ఆట కోసం ఎన్నో త్యాగాలు చేశాను. ఒక గొప్ప రికార్డును, వారసత్వాన్ని మిగిల్చి ఆట నుంచి నిష్క్రమించాలని ఉంది. రిటైర్మెంట్ తర్వాత ప్రయాణాలు చేయడం, కుటుంబంతో గడపడం వంటి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి" అని పోర్చుగల్ కెప్టెన్, అల్ నాసర్ క్లబ్ స్టార్ అయిన రొనాల్డో వివరించాడు.
రొనాల్డో తన అద్భుతమైన కెరీర్‌లో ఇప్పటివరకు 1,330 మ్యాచ్‌ల్లో 976 గోల్స్ సాధించాడు. మరో 24 గోల్స్ చేస్తే 1000 గోల్స్ అనే అరుదైన మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
Advertisement
Cristiano Ronaldo
Georgina Rodriguez
Ronaldo Retirement Plans
Ronaldo Secret Wedding
Al Nassr
Football Career Record

More Telugu News