జెన్-జీ ఎక్కడ ఖర్చు చేస్తోంది? ప్రయాణాలకు కేవలం 5 శాతమేనట!
- బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లకు అత్యధికంగా 20.1 శాతం ఖర్చు
- కిరాణాకు 15.7 శాతం, ఆహారానికి 11.5 శాతం వ్యయం
- ఆర్థిక సేవలకు 12.2 శాతం, షాపింగ్‌కు 11.9 శాతం
- 24-29 ఏళ్ల వారిలో 59 శాతానికి నిత్యావసర ఖర్చులు
- యూపీఐ, ఆటోపేతో డిజిటల్‌గా మారుతున్న జెన్-జీ ఆర్థిక జీవితం
నిత్యం ప్రయాణాలు, కొత్త అనుభవాలు, డిజిటల్ లైఫ్.. జెన్-జీ అంటే ఇలాగే ఉంటారని చాలామంది అనుకుంటారు. కానీ వారి జేబు ఖర్చుల లెక్కలు మాత్రం మరో కథ చెబుతున్నాయి. ప్రయాణాలకు పెద్దపీట వేస్తారన్న అభిప్రాయానికి భిన్నంగా.. భారత జెన్-జీ తమ నెలవారీ ఖర్చుల్లో కేవలం ఐదు శాతాన్ని మాత్రమే ట్రావెల్‌కు కేటాయిస్తున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.
‘శాలరీసే’ సంస్థ 5.2 లక్షల మందికిపైగా ఉద్యోగం చేస్తున్న జెన్-జీ వ్యక్తుల కోట్లాది యూపీఐ లావాదేవీలను విశ్లేషించి ఈ వివరాలు వెల్లడించింది. వారి నెలవారీ ఖర్చుల్లో ఎక్కువ భాగం నిత్యావసరాలు, బిల్లులు, ఆర్థిక సేవలు, షాపింగ్, ఆహారానికే వెళ్తున్నట్లు తేలింది.
బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లకు అత్యధికంగా 20.1 శాతం ఖర్చు చేస్తున్నారు. కిరాణా సరుకులకు 15.7 శాతం వెచ్చిస్తున్నారు. ఆర్థిక సేవలకు 12.2 శాతం, షాపింగ్‌కు 11.9 శాతం, ఆహారానికి 11.5 శాతం ఖర్చవుతోంది. ఈ ఐదు విభాగాలకే కలిపి 70 శాతానికిపైగా నెలవారీ వ్యయం అవుతోంది.
ట్రావెల్‌కు మాత్రం ఐదు శాతమే కేటాయిస్తున్నారు. అంటే ప్రయాణాలపై ఆసక్తి ఉన్నా.. నెల బడ్జెట్‌లో వాటికి పెద్దగా చోటు ఇవ్వడం లేదని అధ్యయనం సూచిస్తోంది. జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై వంటి వినోద సబ్‌స్క్రిప్షన్లకూ జెన్-జీ ఖర్చు చేస్తోంది. వీటిలో జియోహాట్‌స్టార్ వాటా 12.4 శాతం, నెట్‌ఫ్లిక్స్ 10.7 శాతం, స్పాటిఫై 5.6 శాతంగా ఉంది.
వయసు పెరిగేకొద్దీ అవసరాల ఖర్చు మరింత పెరుగుతోంది. 18-23 ఏళ్ల వయసు వారిలో నిత్యావసర ఖర్చులు 50 శాతం ఉంటే.. 24-29 ఏళ్ల వారిలో 59 శాతానికి చేరాయి.
యూపీఐ, ఆటోపే వల్ల బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లు, ఆర్థిక సేవల చెల్లింపులు మరింత సులభంగా మారాయని శాలరీసే తెలిపింది. దీంతో జెన్-జీ ఆర్థిక జీవితం పూర్తిగా డిజిటల్ వైపు మారుతున్నట్లు అధ్యయనం పేర్కొంది.