పారిపోవడం నీకు అలవాటుగా మారింది.. దమ్ముంటే డీఎస్సీపై చర్చకు అసెంబ్లీకి రావాలి: జగన్ కు ఆలపాటి సవాల్
- ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- జగన్ పై నిప్పులు చెరిగిన టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్
- ఆధారాలు లేని ఆరోపణలతో వైసీపీ వీధి నాటకాలు ఆడుతోందని విమర్శ
- జగన్ అంతటి రాజకీయ అజ్ఞాని మరొకరు లేరని తీవ్ర వ్యాఖ్యలు
- ఉద్యోగాలు సాధించిన యువతకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మెగా డీఎస్సీ నియామకాలపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే.. ఈ నెల 17న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరారు. బుధవారం నాడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఐదేళ్ల పాలనలో ఏటా ‘జాబ్ క్యాలెండర్’ పేరిట ‘జాబ్ లెస్ క్యాలెండర్’లు విడుదల చేసి నిరుద్యోగులను మోసం చేసిన జగన్, ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆలపాటి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కేవలం 6,000 పోస్టులతో కంటితుడుపు నోటిఫికేషన్ ఇస్తే, తాము 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించామని స్పష్టం చేశారు.
ఈ నియామక ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ ఏకంగా 255 కేసులు వేసిందని ఆలపాటి ఆరోపించారు. అయినప్పటికీ, న్యాయపరమైన చిక్కులన్నింటినీ అధిగమించి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో కేవలం 150 రోజుల్లోనే అత్యంత పారదర్శకంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని కొనియాడారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఇప్పుడు రికార్డు సమయంలో నియామకాలు పూర్తి చేసి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించామని అన్నారు.
ఓ వైసీపీ ఎమ్మెల్సీ డీఎస్సీపై రెండుసార్లు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేస్తే, ఆధారాలు చూపాలని న్యాయస్థానం ప్రశ్నించిందని ఆలపాటి ఎద్దేవా చేశారు. ఏ ఒక్క అభ్యర్థి అయినా ఫిర్యాదు చేశారా అని కోర్టు నిలదీస్తే వైసీపీ నేతల వద్ద సమాధానం లేకుండా పోయిందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లను పక్కాగా అమలు చేశామని తెలిపారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన వారిని వైసీపీ నేతలు అసభ్య పదజాలంతో అవమానించడం దారుణమని మండిపడ్డారు.
జగన్ చేస్తున్నది రాజకీయ పోరాటం కాదని, ఆధారాలు లేని వీధి నాటకాలని ఆలపాటి తీవ్రంగా విమర్శించారు. "సభకు రాకుండా పారిపోవడం నీకు అలవాటుగా మారింది. నేను చూసిన రాజకీయ నాయకుల్లో జగన్ అంతటి ‘రాజకీయ అజ్ఞాని’ మరొకరు లేరు" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పారదర్శకంగా జరిగిన నియామకాలపై నిందలు వేస్తూ, ఉద్యోగాలు సాధించిన యువతను అవమానించినందుకు జగన్ రెండు చేతులెత్తి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.