త్రిషను డిప్యూటీ సీఎం ఎప్పుడు చేస్తారు?.. సీఎం విజయ్‌పై ఏఐఏడీఎంకే నేత సెటైర్
- తమిళనాడు సీఎం విజయ్‌పై ఏఐఏడీఎంకే నేత ఉదయకుమార్ వ్యంగ్యాస్త్రాలు
- సినిమా రంగంలోని వారికే ప్రభుత్వ పదవులు కట్టబెడుతున్నారని ఆరోపణ
- ఇటీవల త్రిషపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో తాజా ఘటన
తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌ను ముడిపెడుతూ మరో రాజకీయ వివాదం చెలరేగింది. విజయ్‌తో అనేక చిత్రాలలో నటించిన త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారంటూ ఏఐఏడీఎంకే నేత, మాజీ మంత్రి ఆర్.బి.ఉదయకుమార్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
ఉదయకుమార్ మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఆయన, టీవీకే ప్రభుత్వం.. ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉన్నవారికే ప్రభుత్వ పదవులు కట్టబెడుతోందని ఆరోపించారు. ముఖ్యంగా, విజయ్ సినిమాలకు పనిచేసిన నిర్మాతలు, సాంకేతిక సిబ్బందిని ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో నియమిస్తున్నారని విమర్శించారు. ఆలయ ట్రస్టీ, న్యూఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, సీఎం వ్యక్తిగత కార్యదర్శి, రాష్ట్ర ఫిల్మ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ హెడ్, ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన వారిని ఉదహరించారు. ఈ క్రమంలోనే, త్రిషను ఎప్పుడు డిప్యూటీ సీఎం చేస్తారంటూ ఆయన ఎద్దేవా చేశారు.
నటి త్రిషను ఉద్దేశించి ద్వంద్వార్థాలతో వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై డీఎంకే నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేసి, విచారణ అనంతరం విడుదల చేసిన కొన్ని రోజులకే ఈ కొత్త వివాదం తలెత్తడం గమనార్హం. అయితే, తాను రాష్ట్రానికి కావేరి జలాల గురించి మాత్రమే మాట్లాడానని, తన వ్యాఖ్యలకు ఒకే అర్థం ఉందని అప్పట్లో ఉదయనిధి స్పష్టం చేశారు. ఇప్పుడు ఉదయకుమార్ వ్యాఖ్యలతో త్రిష పేరు మరోసారి తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.