సాయిబాబాపై విష ప్రచారం.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
- షిర్డీ సాయిబాబాపై ఆన్‌లైన్‌లో విష ప్రచారం
- బాబాను కించపరిచే వీడియోలు తొలగించాలని హైకోర్టులో పిటిషన్
- స్పందించిన ఢిల్లీ హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- అభ్యంతరకర కంటెంట్ తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలని సూచన
షిర్డీ సాయిబాబాను అవమానిస్తూ, ఆయనపై ప్రజల్లో విద్వేషం రగిలించేలా ఆన్‌లైన్‌లో జరుగుతున్న దుష్ప్రచారంపై ఢిల్లీ హైకోర్టు దృష్టి సారించింది. బాబా అసలు పేరు ‘చాంద్ మియా’ అని, ఆయనో జిహాదీ, హంతకుడు, రేపిస్ట్ అంటూ అత్యంత దారుణంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, యూట్యూబ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో ఉన్న ఇలాంటి అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమాజంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి, అశాంతిని సృష్టించేందుకు ఈ కుట్ర జరుగుతోందని ట్రస్ట్ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ విషయంపై తాము ఇప్పటికే యూట్యూబ్‌ను సంప్రదించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు వివరించింది.
జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. బాబాకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ తొలగింపుపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.