బాలినేని, దామచర్ల రగడపై టీడీపీ, జనసేన నాయకత్వాలు సీరియస్
- ఒంగోలులో బాలినేని, దామచర్ల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం
- తీవ్రంగా స్పందించిన టీడీపీ, జనసేన అధిష్టానాలు
- ఇద్దరు నేతలకు ఫోన్లు చేసి సంయమనం పాటించాలని సూచన
- బహిరంగ విమర్శలతో కూటమికి నష్టం చేయొద్దని హెచ్చరిక
- పరిస్థితిని సమీక్షించిన కూటమి సమన్వయ కమిటీ
ఒంగోలు వేదికగా జనసేన నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మధ్య చోటుచేసుకుంటున్న మాటల యుద్ధంపై టీడీపీ, జనసేన పార్టీల అధిష్ఠానాలు తీవ్రంగా స్పందించాయి. నేతలిద్దరూ సంయమనం పాటించాలని, బహిరంగ విమర్శలకు దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఈ వ్యవహారం కూటమి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని భావించిన ఇరు పార్టీల అగ్రనేతలు తక్షణమే రంగంలోకి దిగారు.
ఈ పరిణామాలపై కూటమి సమన్వయ కమిటీ సభ్యులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశంలో టీడీపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలుంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప, బహిరంగ విమర్శలకు దిగడం కూటమి ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో నేరుగా మాట్లాడారు. సంయమనం పాటించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. అటు జనసేన నేతలు కూడా బాలినేనితో మాట్లాడారు.
ఒంగోలు నియోజకవర్గంలో భూములు, ఇసుక, రేషన్ పంపిణీలో జరుగుతున్న అక్రమాల్లో ఎమ్మెల్యేకు భాగస్వామ్యం ఉందని, దీనిపై విచారణ జరిపించాలని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఈ విమర్శలపై దామచర్ల జనార్ధన్ ధీటుగా స్పందిస్తూ, బాలినేని నియోజకవర్గానికి అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటారని, గతంలో టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించారని, ఇప్పటికీ కూటమి ప్రయోజనాలకు వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో ఈ అంతర్గత విభేదాలు కూటమికి రాజకీయంగా నష్టం చేకూర్చకూడదనే ఉద్దేశంతోనే ఇరు పార్టీల అధిష్ఠానాలు సత్వరమే జోక్యం చేసుకున్నాయి.