ప్రభుత్వం కూలాక.. తెరమరుగైన బంగ్లా వీరనారీమణులు
- బంగ్లాదేశ్ జులై ఉద్యమంలో ముందున్న మహిళలు
- ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరం
- రాజకీయ, సామాజిక అడ్డంకులే ఇందుకు కారణమని ఆరోపణలు
- ఉద్యమకారిణులపై ఆన్‌లైన్‌లో అసభ్యకర దాడి, వ్యక్తిత్వ హననం
- పార్లమెంట్‌లో 5 శాతం సీట్ల హామీని పార్టీలు విస్మరించాయని నివేదిక
- మహిళా సంస్కరణల కమిషన్‌ను కూడా పక్కనపెట్టారన్న విమర్శలు
బంగ్లాదేశ్‌లో 2024 జులైలో జరిగిన ప్రజా ఉద్యమంలో మహిళలు కీలక శక్తిగా నిలిచారు. నాటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో వీరు ముందున్నారు. అయితే, ప్రభుత్వం కూలిపోయి కొత్త పాలన వచ్చాక.. దేశ రాజకీయ, అధికారిక వ్యవస్థల నుంచి ఈ మహిళలు వేగంగా కనుమరుగయ్యారని ఓ నివేదిక వెల్లడించింది.
‘ది డైలీ స్టార్’ కథనం ప్రకారం, జులై ఉద్యమ సమయంలో యూనివర్సిటీలు, క్యాంపస్‌లలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నినాదాలు చేయడం, జైలు వ్యాన్‌లను అడ్డుకోవడం, గాయపడిన వారికి వైద్య సాయం అందించడం, ఆహారం ఏర్పాటు చేయడం వంటి పనులతో ఉద్యమాన్ని నడిపించారు. వారు కేవలం కార్యకర్తలుగా కాకుండా, ఉద్యమ గమనాన్ని నిర్దేశించే నిర్ణయాల్లోనూ భాగమయ్యారు.
అయితే ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చిన వారికి మహిళలు దూరమయ్యారు. దీనికి రాజకీయ, వ్యవస్థాగత, సామాజిక అడ్డంకులే కారణమని మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోని ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా సంస్కరణల కమిషన్‌కు నేతృత్వం వహించిన షిరీన్ పర్విన్ హక్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ కమిషన్‌ను మొదట్నుంచీ పక్కనపెట్టారని, ఇతర కమిషన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని ఆమె తెలిపారు.
జులై ఉద్యమంలో పాల్గొన్న 15 మంది మహిళా నేతలపై వచ్చిన 139 పోస్టులను విశ్లేషించగా, వాటిలో 63 శాతం లైంగికంగా కించపరిచే పదజాలం, అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడేవిగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. పురుష రాజకీయ నాయకులతో విభేదిస్తే తర్కంతో సమాధానమిస్తారని, కానీ మహిళల విషయంలో వారి దుస్తులు, వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తారని ప్రైవేట్ యూనివర్సిటీల మాజీ కోఆర్డినేటర్ నఫ్సిన్ మెహనాజ్ అజిరీన్ ఆవేదన వ్యక్తం చేశారు.
జులై చార్టర్ కింద, పార్లమెంటులోని 300 స్థానాల్లో కనీసం 5 శాతం మహిళలకు కేటాయించాలని రాజకీయ పార్టీలు అంగీకరించాయి. కానీ, ఏ పార్టీ కూడా ఈ నిబంధనను పాటించలేదని ఆ నివేదిక హైలైట్ చేసింది.