ఎనిమిదేళ్ల విరామం తర్వాత వెండితెరపైకి ప్రీతి జింటా: ఆమిర్ ఖాన్ బ్యానర్లో గ్రాండ్ రీఎంట్రీ
- మహేశ్ బాబు, వెంకటేశ్ సినిమాల్లో మెరిసిన ప్రీతి జింటా
- పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన వైనం
- ‘బట్వార్ 1947’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ
ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించిన బాలీవుడ్ నటి ప్రీతి జింటా... సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. మహేశ్ బాబుతో ‘రాజకుమారుడు’, వెంకటేశ్ సరసన ‘ప్రేమంటే ఇదేరా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అలరించిన ఆమె, వివాహం అనంతరం సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఒక భారీ పీరియాడికల్ డ్రామాతో గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ సరసన ప్రీతి జింటా కథానాయికగా నటించిన లేటెస్ట్ పీరియడ్ డ్రామా మూవీ ‘బట్వార్ 1947’. 1947 నాటి దేశ విభజన నేపథ్యంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్ ఖాన్ నిర్మించగా, విలక్షణ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి తెరకెక్కించారు.