అట్టుడుకుతున్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌.. 20 మంది మృతి

International
Advertisement
  • పీఓకేలో లాంగ్ మార్చ్ సందర్భంగా హింస
  • కనీసం 20 మంది మృతి, పలువురికి గాయాలు
  • చర్చలు విఫలమవడంతో జేఏఏసీ ఆందోళన
  • నిరసనకారులపై కాల్పుల ఆరోపణలు
Advertisement
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ)’ చేపట్టిన లాంగ్ మార్చ్ సందర్భంగా జరిగిన హింసలో కనీసం 20 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

జేఏఏసీ మంగళవారం ఎక్స్‌లో చేసిన పోస్టు ప్రకారం.. లాంగ్ మార్చ్ బృందాలు రావల్‌కోట్‌కు చేరుకున్నాయి. ఇప్పటివరకు 19 మంది మృతుల గుర్తింపును నిర్ధారించామని తెలిపింది. తలకు బుల్లెట్ గాయం అయిన మరో వ్యక్తి వద్ద గుర్తింపు పత్రాలు లేకపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 20కి చేరిందని పేర్కొంది. పరిస్థితులు సాధారణమైన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.

జేఏఏసీ, పాకిస్థాన్ అధికారుల మధ్య చర్చలు విఫలం కావడంతో ఈ లాంగ్ మార్చ్ చేపట్టారు. ఆదివారం మీర్‌పూర్ డివిజన్ నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ సోమవారం ముజఫరాబాద్ వైపు సాగింది. మరోవైపు పాక్ భద్రతా బలగాలు శాంతియుత నిరసనకారులపై సోమవారం సాయంత్రం కాల్పులు, టియర్ గ్యాస్‌, భారీ బలప్రయోగానికి పాల్పడ్డాయని ‘యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ’ (యూకేపీఎన్‌పీ) ఆరోపించింది. దీంతో పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారని పేర్కొంది.

ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు వెంటనే జోక్యం చేసుకోవాలని యూకేపీఎన్‌పీ కోరింది. శాంతియుత నిరసనకారులపై కాల్పులు, అధిక బలప్రయోగాన్ని నిలిపివేయాలని పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు పీఓకేలో జరుగుతున్న నిరసనలపై భారత విదేశాంగ శాఖ గత నెల స్పందించింది. అక్కడ పోలీసుల దౌర్జన్యాల్లో పలువురు మరణించారని, అనేక మంది గాయపడ్డారని పేర్కొంటూ పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా నిలపాలని ఆశిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
Advertisement

సంబంధిత వార్తలు

Pakistan Occupied KashmirJoint Awami Action CommitteePoK protests violenceMuzaffarabad long marchPakistan security forcesUKPNP UN intervention

More Telugu News

ఏపీకి మరో తుపాను గండం.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనున్న తీవ్ర తుపాను!

31 Oct, 22:06

ఆ 53 రోజుల అక్రమ నిర్బంధంపై కోట్లాది ప్రజల స్పందనను ఎప్పటికీ మరువను: సీఎం చంద్రబాబు

31 Oct, 21:54

డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. అగ్రస్థానానికి న్యూజిలాండ్, నాలుగో స్థానానికి టీమిండియా

31 Oct, 21:40

రామ్‌చరణ్‌-సుకుమార్‌ క్రేజీ ప్రాజెక్ట్.. రేపే గ్రాండ్ ఓపెనింగ్

31 Oct, 21:33

ఇది నిజం గెలిచిన రోజు.. న్యాయం జరిగిన రోజు: నారా లోకేశ్

31 Oct, 21:24

ఆసీస్ ను కుప్పకూల్చి.. సిరీస్ గెలిచి.. టెస్టుల్లో తిరిగి నెం.1గా దక్షిణాఫ్రికా

31 Oct, 21:11

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18
..More Telugu News