స్మగ్లర్లతో చేతులు కలిపిన ఫారెస్ట్ అధికారి.. పవన్ కల్యాణ్ సీరియస్

Andhra
Advertisement
  • ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించేవారిని ఉపేక్షించబోమని పవన్ హెచ్చరిక
  • కడప జిల్లాలో రూ.1.5 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగల స్వాధీనం
  • స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అరెస్ట్
  • అధికారి పాత్రపై లోతైన విచారణకు ఉప ముఖ్యమంత్రి ఆదేశం
  • ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటుకు సూచన
Advertisement
ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే వారు ఎవరైనా సరే, ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. స్మగ్లింగ్‌కు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతామని, ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు 'ఆపరేషన్ అరణ్య'ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని ఆయన తెలిపారు.

కడప జిల్లా అవధూత కాశినాయన మండలంలో శనివారం రూ.1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై ఆయన అటవీ, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు వారికి సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు పవన్ కల్యాణ్‌కు వివరించారు.

శనివారం తెల్లవారుజామున వరికుంట్ల గ్రామ సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం, రాష్ట్ర ఇంటెలిజెన్స్ బృందానికి అందిన కచ్చితమైన సమాచారంతో వాహనాలను తనిఖీ చేశారు. ఇంటి సామాగ్రి ముసుగులో బొలెరో మ్యాక్స్ ట్రక్కులో దుంగలను తరలిస్తున్న హర్యానాకు చెందిన సన్నీ, రమేశ్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి నుంచి వాహనాన్ని, దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో భాగంగా, జ్యోతి ఫారెస్ట్ బీట్‌లో పనిచేస్తున్న బీట్ ఆఫీసర్ మల్లికార్జునుడు ఈ ముఠాకు సహకరిస్తున్నట్లు తేలడంతో అతడిని కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసు వెనుక బెంగళూరు, హర్యానా, కోల్‌కతా కేంద్రాలుగా పనిచేస్తున్న ప్రధాన సూత్రధారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రధాన సూత్రధారులను వెంటనే అరెస్టు చేయాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లికార్జునుడి పాత్రపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని సూచించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Pawan KalyanRed Sandalwood SmugglingOperation AranyaKadapaForest Officer ArrestedAndhra Pradesh News

More Telugu News

ఏపీకి మరో తుపాను గండం.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనున్న తీవ్ర తుపాను!

31 Oct, 22:06

ఆ 53 రోజుల అక్రమ నిర్బంధంపై కోట్లాది ప్రజల స్పందనను ఎప్పటికీ మరువను: సీఎం చంద్రబాబు

31 Oct, 21:54

డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. అగ్రస్థానానికి న్యూజిలాండ్, నాలుగో స్థానానికి టీమిండియా

31 Oct, 21:40

రామ్‌చరణ్‌-సుకుమార్‌ క్రేజీ ప్రాజెక్ట్.. రేపే గ్రాండ్ ఓపెనింగ్

31 Oct, 21:33

ఇది నిజం గెలిచిన రోజు.. న్యాయం జరిగిన రోజు: నారా లోకేశ్

31 Oct, 21:24

ఆసీస్ ను కుప్పకూల్చి.. సిరీస్ గెలిచి.. టెస్టుల్లో తిరిగి నెం.1గా దక్షిణాఫ్రికా

31 Oct, 21:11

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18
..More Telugu News