హైదరాబాద్‌లో కొవిడ్ కలకలం.. వైరస్ లక్షణాలతో ఆస్పత్రులకు బాధితులు!

Telangana
Advertisement
  • నగరంలో తీవ్ర జ్వరం, దగ్గు లక్షణాలు
  • పరీక్షలు చేయకపోవడంతో వెలుగుచూడని కేసులు
  • కిట్లు, నిధుల లేమితో ఆస్పత్రులు
Advertisement
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నలుగురు మృత్యువాత పడటంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు గత నెల రోజులుగా తీవ్రమైన జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పుల లక్షణాలతో వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే, బాధితులకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయకపోవడంతో ఈ కేసులు బయటకు రావడం లేదు. ఫలితంగా తెలంగాణలో కరోనా కేసులు ‘సున్నా’ అని అధికారిక వర్గాలు చూపుతున్నాయి. ఇటీవల తార్నాకకు చెందిన ఒక మహిళ ఊపిరితిత్తులు దెబ్బతిని మరణించడం, గాంధీ ఆస్పత్రిలో ఒక కేసు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ, ప్రజారోగ్య విభాగం నుంచి ఎలాంటి హెచ్చరికలు గానీ, పరీక్షల ఆదేశాలు గానీ జారీ కాకపోవడం గమనార్హం. నాలుగేళ్లుగా కిట్లు, మాస్కులు, శానిటైజర్ల కొనుగోలును నిలిపివేయడంతో ఆస్పత్రుల్లో తీవ్ర కొరత ఏర్పడింది. ఐసీఎంఆర్ నివేదికల ప్రకారం జూన్ నుంచి దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నా, రాష్ట్రంలో వ్యాధుల తీవ్రతను పర్యవేక్షించాల్సిన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్‌పీ) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Hyderabad COVID 19Telangana coronavirus casesGandhi HospitalICMR COVID reportTarnaka COVID deathCOVID 19 symptoms 2024

More Telugu News

ఏపీకి మరో తుపాను గండం.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనున్న తీవ్ర తుపాను!

31 Oct, 22:06

ఆ 53 రోజుల అక్రమ నిర్బంధంపై కోట్లాది ప్రజల స్పందనను ఎప్పటికీ మరువను: సీఎం చంద్రబాబు

31 Oct, 21:54

డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. అగ్రస్థానానికి న్యూజిలాండ్, నాలుగో స్థానానికి టీమిండియా

31 Oct, 21:40

రామ్‌చరణ్‌-సుకుమార్‌ క్రేజీ ప్రాజెక్ట్.. రేపే గ్రాండ్ ఓపెనింగ్

31 Oct, 21:33

ఇది నిజం గెలిచిన రోజు.. న్యాయం జరిగిన రోజు: నారా లోకేశ్

31 Oct, 21:24

ఆసీస్ ను కుప్పకూల్చి.. సిరీస్ గెలిచి.. టెస్టుల్లో తిరిగి నెం.1గా దక్షిణాఫ్రికా

31 Oct, 21:11

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18
..More Telugu News