ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇంటి ముందు రాహుల్, ప్రియాంక ధర్నా
- పార్లమెంట్ నుంచి ప్రధాని ఇంటికి పాదయాత్రగా వెళ్లిన కాంగ్రెస్ నేతలు
- ప్రధాని నివాసం ముట్టడికి యత్నం
- అడ్డుకున్న పోలీసులు
- ప్రధాని నివాసం ముందు బైఠాయించిన కాంగ్రెస్ అగ్రనేతలు
- నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మోదీ, షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మంగళవారం ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేరా, కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడా, డీకే శివకుమార్, రాజా వారింగ్‌తో పాటు పలువురు నేతలు పాదయాత్రగా ప్రధాని నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ వైపు వెళ్లారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించి వారిని అడ్డుకున్నారు.
పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ నేతలు అక్కడే ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ర్యాలీ చేపట్టారని పోలీసులు చెబుతుండగా, ప్రజాస్వామ్య హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ ధర్నాలో నేతలు ప్లాస్టిక్ ట్యాగ్ లతో చేతులను కట్టేసుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులపై జరిగిన దాడికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని, యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు మోదీ, హోంమంత్రి అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని ఆరోపించారు. అలాగే సోమవారం ఆందోళనలో గాయపడిన విద్యార్థులను రాహుల్, ప్రియాంక గాంధీ ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.