‘టాక్సిక్’ నుంచి రెండో పాట.. యశ్-తారా రొమాన్స్‌తో ‘మనసు ఆగదు’!
- తాజా పాటలో యశ్, తారా మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణ
- తొలి పాట ‘తబాహి’కి మించిన రొమాన్స్
- యశ్ గన్‌తో ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగే సీన్ హైలైట్
- విడుదలైన కొన్ని గంటల్లోనే పాట వైరల్
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి చిత్రబృందం రెండో పాట ‘మనసు ఆగదే’ను విడుదల చేసింది. ఇప్పటికే వచ్చిన తొలి పాట ‘తబాహి’తో బోల్డ్ రొమాంటిక్ టోన్‌ను చూపించిన మేకర్స్.. ఇప్పుడు రెండో పాటలో అంతకుమించిన రొమాన్స్‌ను ఆవిష్కరించారు.
ఈ పాటలో యశ్, బాలీవుడ్ నటి తారా సుతారియా మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాత్‌టబ్‌లో తారా ఎంట్రీ, ఆమెకు యశ్ గన్‌తో ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగే సీన్, వర్షంలో ఇద్దరి రొమాంటిక్ మూమెంట్స్, కేఫ్‌లో ముద్దులతో సాగే సన్నివేశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు విశాల్ మిశ్రా, కనిష్క్ బాగ్చీ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. రెండో పాట విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.