‘నాకు ఒకే ఒక్క కూతురు.. ఆమె పేరు మణెమ్మ’: ‘ఇరుముడి’ డబ్బింగ్ ప్రారంభించిన రవితేజ
- డబ్బింగ్ పనుల వీడియో విడుదల చేసిన చిత్రబృందం
- తండ్రీకూతుళ్ల బంధంపై ఎమోషనల్ కథ
- మరో మూడు రోజులే షూటింగ్ మిగులు
- ఆగస్టు 21న గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు
- జి.వి. ప్రకాశ్ రీ-రికార్డింగ్ పనులు ప్రారంభం
రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘ఇరుముడి’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి రవితేజ డబ్బింగ్ ప్రారంభించారు. షూటింగ్‌లో తన భాగాన్ని పూర్తి చేసిన ఆయన స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. అందులో ‘‘నాకు ఒకే ఒక్క కూతురు... ఆమె పేరు మణెమ్మ’’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ వీడియోలో దర్శకుడు శివ నిర్వాణ, బాలనటి నక్షత్ర కూడా కనిపించారు.
ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మరో మూడు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. మరోవైపు జి.వి. ప్రకాశ్‌కుమార్ రీ-రికార్డింగ్ పనులు కూడా ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో కూతురిపై అపారమైన ప్రేమ చూపించే తండ్రిగా రవితేజ కనిపించారు. అనూహ్య సంఘటనల తర్వాత మద్యానికి బానిసైన అతడు, కూతురు మాటతో అయ్యప్ప మాల ధరించి జీవితాన్ని మార్చుకునే ప్రయాణం కథలో కీలకంగా ఉండనుంది.
రవితేజ కెరీర్‌లో 77వ చిత్రంగా వస్తున్న ‘ఇరుముడి’లో భక్తి, భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలను సమపాళ్లలో మేళవించినట్లు చిత్రబృందం చెబుతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధమే కథకు ప్రధాన బలమని సమాచారం. ఇందులో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో కనిపించనుంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, శ్వాసిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.