రాజస్థాన్ రాయల్స్ వివాదం: శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ
- రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా ఇంగ్లండ్ హైకోర్టు తీర్పు
- ఎమర్జింగ్ మీడియాకు 4.94 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశం
- ఈ వివాదంపై భారత్‌లో కేసులు పెట్టకుండా శాశ్వత నిషేధం
- రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ యాజమాన్య హక్కుల వివాదంపై తీర్పు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య హక్కుల వివాదంలో ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ (ఈఎంవీ) సంస్థకు ఆయన 4.94 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 41 కోట్లు) తిరిగి చెల్లించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ వివాదంపై భారత్‌లో ఎటువంటి న్యాయపరమైన చర్యలు చేపట్టకుండా ఆయనపై శాశ్వత నిషేధం (యాంటీ-సూట్ ఇంజంక్షన్) విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఏం జరిగిందంటే?
గతంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో రాజ్ కుంద్రాకు చెందిన కుకీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ ద్వారా పరోక్షంగా 11.7 శాతం వాటా ఉండేది. 2015లో ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఫ్రాంచైజీపై రెండేళ్ల నిషేధం విధించారు. ఆ సమయంలోనే కుంద్రా తన వాటాలను బదిలీ చేశారు. అనంతరం 2019లో ఈఎంవీ సంస్థతో కుంద్రా ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం సుమారు 4.94 మిలియన్ డాలర్లు తీసుకున్న ఆయన, భవిష్యత్తులో ఎలాంటి క్లెయిమ్‌లు చేయబోనని, వివాదాలు తలెత్తితే ఇంగ్లండ్ కోర్టుల పరిధిలోనే పరిష్కరించుకోవాలని అంగీకరించారు.
అయితే, ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను ఈఎంవీ సంస్థ విక్రయించడానికి సిద్ధమవడంతో ఈ వివాదం మళ్లీ మొదలైంది. 2019 ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నిధుల దుర్వినియోగం జరిగిందంటూ కుంద్రా ముంబైలోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్టీ)తో పాటు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈఎంవీ సంస్థ లండన్ కోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ గ్రిఫిత్స్ సోమవారం తుది తీర్పు వెలువరించారు. కుంద్రా ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను కుంద్రా తీసుకున్న సొమ్మును వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని సుమారు 1.65 బిలియన్ డాలర్ల భారీ విలువతో లక్ష్మీ మిట్టల్ కుటుంబం, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.