ఒకప్పుడు కరెంట్ బిల్లు కట్టలేకపోయాడు.. ఇప్పుడు ఏకంగా ఓ ద్వీపానికే యజమాని!
- కరెంట్ బిల్లు కట్టలేని స్థితి నుంచి ఎదిగిన ఎలిసన్
- గ్యారేజ్‌లో మొదలైన ఒరాకిల్ ప్రయాణం
- 256 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రశ్రేణి బిలియనీర్
- హవాయి లనాయ్ ద్వీపంలో 98 శాతం కొనుగోలు
- విలాసవంతమైన యాచ్‌లు, భారీ పెట్టుబడులు
ఒకప్పుడు వర్క్‌షాప్‌లో కరెంట్ కట్ కాకుండా ఉండడం కోసం విద్యుత్ సంస్థను గడువు అడిగిన వ్యక్తి.. నేడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు. కంప్యూటర్‌కు విద్యుత్ ఉంటే చాలు.. అదే తన భవిష్యత్తును మార్చేస్తుందని నమ్మిన ఆ యువకుడు, తర్వాత ఏకంగా ఓ ద్వీపాన్నే కొనుగోలు చేసే స్థాయికి ఎదిగారు. ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయక కథగా నిలిచింది.
లారీ ఎలిసన్ కెరీర్ ప్రారంభ దశ అంతా కష్టాలతోనే సాగింది. 1970ల్లో చిన్న గ్యారేజ్‌లో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేస్తూ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. చేతిలో డబ్బు లేక విద్యుత్ బిల్లు కూడా పూర్తిగా చెల్లించలేని పరిస్థితి ఎదురైంది. విద్యుత్ నిలిపివేయొద్దని కంపెనీలను కోరుతూ, బిల్లులో కేవలం 10 శాతం చెల్లించి మిగతా మొత్తం తర్వాత ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. ఇంట్లో లైట్లు, ఇతర సౌకర్యాల కోసం కాదు.. తన కంప్యూటర్ పనిచేయాలంటే విద్యుత్ తప్పనిసరి కావడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఎలిసన్ తర్వాత గుర్తు చేసుకున్నారు.
ఆయన బాల్యం అంత సాఫీగా సాగలేదు. దత్తత తీసుకున్న తర్వాత బంధువుల వద్ద పెరిగారు. చికాగో విశ్వవిద్యాలయంలో చదువు మధ్యలోనే మానేశారు. వ్యాపారం ప్రారంభించేందుకు పెట్టుబడుల కోసం వెంచర్ క్యాపిటల్ సంస్థల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ కలిసేందుకు కూడా ముందుకు రాలేదని ఆయన చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత అంపెక్స్ సంస్థలో ప్రోగ్రామర్‌గా చేరడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) కోసం రూపొందించిన డేటాబేస్ ప్రాజెక్ట్‌కు అంతర్గతంగా 'ఒరాకిల్' అనే కోడ్ పేరు ఉండేది. అదే పేరుతో సహచర ఇంజినీర్లతో కలిసి ఆయన సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రారంభించాడు. ఆ సంస్థ తర్వాత ప్రపంచ ఐటీ రంగంలో అగ్రస్థానానికి చేరింది. ప్రస్తుతం లారీ ఎలిసన్ సంపద సుమారు 256 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.
వ్యాపారంలో విజయాలు సాధించిన తర్వాత ఎలిసన్ విలాసవంతమైన జీవితాన్ని ఎంచుకున్నాడు. 2012లో హవాయిలోని లనాయ్ ద్వీపంలో 98 శాతం భూభాగాన్ని సుమారు 300 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. దాదాపు మొత్తం ద్వీపానికే యజమానిగా మారాడు. 2020 నుంచి అక్కడే నివసిస్తూ పూర్తిగా హరిత ద్వీపంగా మార్చే ప్రణాళికపై పనిచేస్తున్నాడు. మరోవైపు వందల మిలియన్ డాలర్ల విలువైన విలాసవంతమైన ఓడలను కూడా కొనుగోలు చేశాడు.
ఇటీవలి రోజుల్లో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో ఆయన సంపదలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టెక్నాలజీ, కృత్రిమ మేధ రంగ కంపెనీల షేర్లు పడిపోవడంతో కొన్ని రోజుల్లోనే ఆయన నికర సంపద దాదాపు 47 బిలియన్ డాలర్లు తగ్గింది. అయినా ఒరాకిల్ క్లౌడ్ వ్యాపారం బలంగా కొనసాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. వ్యాపార విజయాలు, ఒడిదుడుకులు జీవితంలో భాగమేనని, కష్టకాలంలో పట్టుదలే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని లారీ ఎలిసన్ ప్రయాణం మరోసారి చాటిచెబుతోంది.