సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో జీ5 దూకుడు.. నాగచైతన్య నుంచి బాలయ్య వరకు!

ZEE5 upcoming projects featuring Balakrishna Naga Chaitanya and Venkatesh
  • జీ5 కొత్త ప్రాజెక్టుల ప్రకటన
  • తెలుగు క్రేజీ సినిమాలకు ఓటీటీ డీల్‌
  • నాగచైతన్య, బాలయ్య చిత్రాలు జాబితాలో
  • పలు భాషల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
  • ఏఐ యానిమేషన్‌ ప్రాజెక్టులకూ స్థానం
ఓటీటీ రంగంలో పోటీ రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ సంస్థలు తమదైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌, జియో హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ విషయంలో దూకుడు ప్రదర్శిస్తుండగా.. ఇప్పుడు జీ5 కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమైంది. త్వరలో తమ వేదికపై విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితాను వెల్లడించింది.

ఈ లిస్ట్‌లో ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న పలు క్రేజీ ప్రాజెక్టులు చోటు దక్కించుకోవడం విశేషం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలకు చెందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు యానిమేషన్‌ ప్రాజెక్టులను కూడా జీ5 ప్రకటించింది. దీంతో రాబోయే రోజుల్లో ఓటీటీ ప్రేక్షకులకు భారీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్యాకేజీ సిద్ధమవుతోంది.

తెలుగు విభాగంలో నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’, బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న #ఎన్‌బీకే111, అనిల్‌ రావిపూడి-వెంకటేశ్‌ కాంబో చిత్రం, కల్యాణ్‌రామ్‌ కొత్త సినిమా, నివేదా థామస్‌ నటిస్తున్న ‘శ్రీమతి’, శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో ‘అబ్జెక్షన్‌ మై లార్డ్’, ‘అనంతకాలం’ వెబ్‌సిరీస్‌, జగపతిబాబు హోస్ట్‌గా ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ టాక్‌ షో జీ5లో స్ట్రీమ్‌ రానున్నాయి.

హిందీ విభాగంలో ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’, ‘బందర్‌’, ‘భారత్‌ భాగ్య విధాత’, ‘పూజా మేరీ జాన్‌’ సహా పలు సినిమాలను ప్రకటించారు. వెబ్‌సిరీస్‌ల జాబితాలో ‘కాంబ్లీ’, ‘ద స్కామ్‌ లీక్డ్‌’, ‘రంగ్‌బాజ్‌ 4’, ‘లాల్‌బజార్‌ 2’ వంటివి ఉన్నాయి. తమిళంలో ‘రవుడీ’, ‘హాయ్‌’, ‘తడయం 2’, ‘థీ కురల్‌’ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
Advertisement
ZEE5
Naga Chaitanya Vrushakarma
NBK111 Balakrishna
Upcoming OTT movies
Venkatesh Anil Ravipudi film
ZEE5 Telugu web series

More Telugu News