సీఎం విజయ్ చివరి సినిమా.. టికెట్ల ధరలపై కఠిన ఆదేశాలు!

CM Vijay last movie strict orders on ticket prices
  • సీఎం విజయ్ నటనకు గుడ్‌బై.. చివరి చిత్రం 'జన నాయగన్'
  • ప్రపంచవ్యాప్తంగా జూలై 23న భారీ స్థాయిలో విడుదల
  • ప్రభుత్వ ధరలకే టికెట్లు అమ్మాలని థియేటర్లకు ఆదేశాలు
  • సినిమాకు 'A' సర్టిఫికెట్.. 18 ఏళ్ల లోపు వారికి నో ఎంట్రీ
  • వివాదాలు రాకుండా పక్కాగా ప్లాన్ చేస్తున్న నిర్మాతలు
తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ నటుడిగా తన చివరి చిత్రం 'జన నాయగన్' విడుదలకు సర్వం సిద్ధమైంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే, విజయ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉండటంతో, ఈ సినిమా విడుదల అత్యంత కీలకంగా మారింది. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఉండేందుకు నిర్మాతలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,000 థియేటర్లలో, ఒక్క తమిళనాడులోనే సుమారు 950 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ నిర్దేశిత ధరల కంటే ఎక్కువకు టికెట్లు అమ్మవద్దని థియేటర్ యాజమాన్యాలకు నిర్మాతలు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అధిక ధరలకు టికెట్లు అమ్మితే అది రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుందని, ప్రతిపక్షాలు దీన్ని ఆయుధంగా వాడుకునే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'ఏ' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో 18 ఏళ్లలోపు వారిని థియేటర్లలోకి అనుమతించవద్దని కూడా స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, అద్భుతమైన స్పందన వస్తోంది. త్వరలోనే తమిళనాడులోనూ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానుల సంబరాలు భారీగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్యలు రాకుండా చూడటమే లక్ష్యంగా చిత్ర యూనిట్ ముందుకు సాగుతోంది.
Advertisement
Thalapathy Vijay
Jana Nayagan
H Vinoth
Movie Ticket Prices
Vijay Last Film
Tamil Cinema

More Telugu News