తునిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్లకు అంతరాయం
- తుని వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
- గరీబ్ రథ్ సహా పలు ప్యాసింజర్ రైళ్లు ఆలస్యం
- ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన రైల్వే సిబ్బంది
కాకినాడ జిల్లా తునిలో గురువారం సాయంత్రం ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం కారణంగా అత్యంత రద్దీగా ఉండే విశాఖపట్నం - విజయవాడ రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఈ గూడ్స్ రైలు, తుని పట్టణం దాటిన తర్వాత లూప్ లైన్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. రైలులోని ఒక బోగీ అదుపుతప్పి పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడం, ప్రాణ నష్టం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాద ప్రభావంతో విశాఖపట్నం - మహబూబ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖ - సికింద్రాబాద్ గరీబ్ రథ్, ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు ఇతర రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.