కేంద్రమంత్రి కుమారస్వామితో కేటీఆర్ భేటీ.. కీలక విజ్ఞప్తి
- ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్రమంత్రితో కేటీఆర్ భేటీ
- కేంద్ర, రాష్ట్రాలు చెరో రూ.250 కోట్లు ఇస్తే ప్లాంట్ ప్రారంభించవచ్చని ప్రతిపాదన
- ప్లాంట్ తెరిస్తే 6,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని వివరణ
- కేటీఆర్ వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి కుమారస్వామి
- హామీ నెరవేర్చకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించిన కేటీఆర్
తెలంగాణలోని ఆదిలాబాద్‌లో గత కొన్నేళ్లుగా మూతపడి ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కర్మాగారాన్ని తక్షణమే పునరుద్ధరించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామితో సమావేశమైన ఆయన, ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
కేటీఆర్‌తో పాటు సీసీఐ సాధన సమితి ప్రతినిధులు, రైతులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జోగు రామన్న, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులతో కూడిన ప్రతినిధి బృందం కేంద్రమంత్రిని కలిసింది. ఈ ప్లాంట్ పునరుద్ధరణ ద్వారా వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతం యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, తద్వారా ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ వివరించారు.
దాదాపు 2,300 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్‌కు ఏటా 4 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని, సుమారు 100 ఏళ్లకు సరిపడా సున్నపురాయి నిల్వలు అక్కడ ఉన్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. ఇంతటి విలువైన ప్రభుత్వ ఆస్తి నిరుపయోగంగా మారి తుప్పు పట్టకుండా కాపాడాలని ఆయన కోరారు. సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడితో అక్కడ అత్యాధునిక ప్లాంట్‌ను ఏర్పాటు చేయవచ్చని ప్రతిపాదించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.250 కోట్ల చొప్పున 'వయబిలిటీ గ్యాప్ ఫండింగ్' అందిస్తే, ప్లాంట్ కార్యకలాపాలను పునఃప్రారంభించవచ్చని కేటీఆర్ సూచించారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 6,000 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. కేటీఆర్ విన్నపంపై కేంద్రమంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు అందించిన తరహాలోనే ఇక్కడి ప్లాంట్‌కు కూడా మద్దతు ఇవ్వాలని, లేనిపక్షంలో ఫ్యాక్టరీని తెరిపించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
మీడియాతో మాట్లాడిన కేటీఆర్
ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పోరాటం, ఆందోళన తెలంగాణ ప్రయోజనాల కోసమే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ద్వేషం లేదని, అయితే ఆయన తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని తెలిపారు. ప్రజల దృష్టిని మళ్లించడంలో రేవంత్ రెడ్డి అందెవేసిన చేయి అని, ఆ విద్యలో ఆయన ఇప్పటికే నాలుగైదు పీహెచ్‌డీలు చేశారని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 31 నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ తమ పార్టీనే లక్ష్యంగా చేసుకోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చచ్చిన పార్టీ అని వ్యాఖ్యానిస్తున్న ముఖ్యమంత్రి, మరి మళ్లీ తమ పార్టీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, దీనిపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కావాలనే రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి 76 పర్యాయాలు ఢిల్లీకి వెళ్లినా, రాష్ట్రానికి కనీసం 76 పైసలైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ సహా పలు అంశాల్లో ఆధారాలు లేకుండా తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.